Health Tips: కొబ్బరి పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా ..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ డ్యామేజ్ వంటి జబ్బులను నివారించడంలోనూ అద్భుతంగా సాయం చేస్తుంది. చర్మసౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ముడతలు, చిన్న మచ్చలు, నల్ల మచ్చలు నివారిస్తుంది.
కొబ్బరి పూవు తినడం వల్ల ఏలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..? కొబ్బరి కాయంలో ఉన్న నీళ్లు ఇంకిపోయి, కొబ్బరి ముదిరినప్పుడు లోపల తెల్లటి పువ్వు ఏర్పడుతుంది. నిజానికి కొబ్బరి నీళ్లు, కొబ్బరి కంటే ఈ పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణలు. రుచి కూడా బాగుంటుంది. కొబ్బరి పువ్వుతో ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. పై పెచ్చు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…
కొబ్బరిపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని దరిచేరనీయకుండా సాయం చేస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. కొబ్బరి పూవు మన రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కొబ్బరి పూవు కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ డ్యామేజ్ వంటి జబ్బులను నివారించడంలోనూ అద్భుతంగా సాయం చేస్తుంది. ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడంలోనూ సహాయపడుతుంది. కొబ్బరి పువ్వులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొబ్బరి పువ్వు తినడం వల్ల బరువు తగ్గుతారు. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలసట, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది. కొబ్బరిపువ్వులో ఉండే విటమిన్లు,ఖనిజాలు, గౌట్‌నుండికాపాడతాయి . మలబద్ధకాన్ని కూడా లేకుండా చేస్తాయి.
చర్మసౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ముడతలు, చిన్న మచ్చలు, నల్ల మచ్చలు నివారిస్తుంది. విటమిన్ ఏ, సి, కాపర్, క్యాల్షియం, పొటాషియం, మరియు ఫైబర్ కొబ్బరి పువ్వు లో పుష్కలంగా దొరుకుతాయి. ఈ పువ్వు వారానికి ఒక్కసారైనా తినడం వల్ల మానసిక దృఢత్వం బాగుంటుంది . ఇందులో ఉన్న విటమిన్ ఏ దృష్టి లోపాన్ని దూరం చేసి కంటి చూపుని పెంచుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే కొబ్బరి పువ్వు లో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి . కొబ్బరి పువ్వు కాలానుగుణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి మంచి రక్షణ కల్పిస్తుంది. కొబ్బరి పువ్వు తినడం వల్ల మంచి శక్తి ని పొందవచ్చు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..