AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjeer for Diabetes: అంజీర్ పండ్లను ఇలా తింటే మధుమేహం సమస్యకు 10 రోజుల్లోనే చెక్..! మరి వాటిని ఎలా తినాలంటే..?

మధుమేహం సమస్యతో బాధపడేవారు పలు రకాల ఆరోగ్య నియమాలను పాటించాలి. లేకపోతే షుగర్ లెవెల్స్ పెరిగి సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. వారికి అత్తి పండ్లతో ఎంతో మేలు జరుగుతుంది.వారి సమస్యను..

Anjeer for Diabetes: అంజీర్ పండ్లను ఇలా తింటే మధుమేహం సమస్యకు 10 రోజుల్లోనే చెక్..! మరి వాటిని ఎలా తినాలంటే..?
Anjeer For Diabetes
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 10, 2023 | 2:04 PM

Share

ప్రస్తుత కాలంలో సంపూర్ణ ఆరోగ్యవంతుల కంటే ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యేవారే ఎక్కువగా ఉన్నారు. ఇంకా వారిలో చాలా మంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నవారే కావడం చెప్పుకోవలసిన విషయం. ఈ సమస్యతో బాధపడేవారు పలు రకాల ఆరోగ్య నియమాలను పాటించాలి. లేకపోతే షుగర్ లెవెల్స్ పెరిగి సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. వారికి అత్తి పండ్లతో ఎంతో మేలు జరుగుతుంది.వారి సమస్యను పూర్తిగా నయం చేయలేకపోయినప్పటికీ నియంత్రించవచ్చు. అత్తిపండ్లలో పోటాషియం, ఖనిజ లవణాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పలు రకాల వ్యాధులకు అంజీర్‌తో చెక్ పెట్టవచ్చు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు ఇది ఇన్సులిన్‌గా పనిచేసి కంట్రోల్ చేస్తుంది. ఆయుర్వేదంలో అంజీర్ పండ్లకు ప్రత్యేకమైన స్థానముంది. అయితే మధుమేహం నియంత్రించుకునే క్రమంలో తప్పకుండా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది.

ఇలా పాటించడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో మధుమేహం కారణంగా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి వివిధ రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే సమస్యలకు చెక్‌ పెట్టడానికి పలు పోషకాలున్న డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా ఉండడమే కాకుండా అన్ని అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మధుమేహంతో బాధపడుతున్నవారికి అంజీర పండు చాలా మేలు చేస్తుంది. ఈ పండులో శరీరానికి కావాల్సిన ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రిస్తుంది.

అంజీర పండులో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి ప్రయోజనాలు కలగడమేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలు దూరమవుతాయి. మధుమేహంతో బాధపడుతున్నవారు ఈ పండ్లను 4 నుంచి 5 గంటలు పాలలో నానబెట్టి రాత్రి నిద్రపోయే ముందు తినాలి. అయినప్పటికీ మీరు దానిని పరిమిత పరిమాణంలో తినవాల్సి ఉంటుంది. అంజీర్ ఆకుల్లో కూడా చాలా రకాల మూలకాలు ఉంటాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు అంజీర్ ఆకులను టీలో మరిగించి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. అంజీర్ పండ్లతో పాటు.. డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు యాపిల్స్, ఆప్రికాట్లు, బ్లూబెర్రీస్, కాంటాలప్, చెర్రీస్, కివీస్, నారింజ, బొప్పాయి, స్ట్రాబెర్రీలు మొదలైన పండ్లను కూడా తినవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!