Health Care: మెరుగైన ఆరోగ్యం కోరుకున్నట్లయితే.. తప్పక తీసుకోవలసిన 5 సూపర్‌ఫుడ్స్ ఇవే..
ఆరోగ్య సమస్యలు లేని జీవితం కోసం ఆరోగ్యవంతమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఎంతో అవసరం. అంతకంటే ముఖ్యంగా తీసుకునే ఆహారం పోషక విలువలతో నిండి ఉండాలి. సమతూల్యమైన పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు..
ఆరోగ్య సమస్యలు లేని జీవితం కోసం ఆరోగ్యవంతమైన జీవన శైలి, ఆహారపు అలవాట్లు ఎంతో అవసరం. అంతకంటే ముఖ్యంగా తీసుకునే ఆహారం పోషక విలువలతో నిండి ఉండాలి. సమతూల్యమైన పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు ఉండవని వైద్యులు పదే పదే చెబుతుంటారు. ఇలా పోషకాహారం తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. తద్వారా సీజనల్ వ్యాధుల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి శరీరం తనను తాను రక్షించుకోగలుగుతుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది పలు రకాల డైట్‌లను ఫాలో అవుతూ తమ శరీరాకృతిని మార్చుకుంటుంటారు. ఇక ఖరీదైన ఫుడ్స్ లాంటివి తీసుకుంటే.. ఆరోగ్యం బాగుంటుందని కొందరి నమ్మకం. కానీ అది కరెక్ట్ కాదు. మీ ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచాలంటే మీ ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండాలి. శరీరానికి కావలసిన పోషకాలను అందించే 5 రకాల బడ్జెట్ ఫ్రీ ఆహార పదార్ధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
- వంట నూనె: వంటకాలకు అతి ముఖ్యమైనది వంట నూనె. ఎలప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలంటే.. మీరు చేయాల్సింది ఒకటే.. వంట నూనెను ఎప్పటికప్పుడు మారుస్తుండటం మంచిది. వంట నూనెను ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. ఆహార పదార్ధాలను వండటానికి వేరుశెనగ వంట నూనె, ఆలివ్ నూనె, బియ్యం ఊక, ఆవ నూనె మొదలైన వాటిని కూడా ఉపయోగించవచ్చు.
- పప్పు ధాన్యాలు: మన శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. దానికోసం పప్పు ధాన్యాలను వినియోగించడం ఉత్తమం. మీ డైట్‌లో మొలకలను చేర్చడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇవే కాకుండా నానబెట్టిన పెసలు, కాయధాన్యాలు వంటి వాటిని కూడా తినండి.
- సీజనల్ ఫ్రూట్స్ లేదా వెజిటబుల్స్: కాలానుగుణంగా కూరగాయలు లేదా పండ్లు ఏవి దొరికినా వాటిని ఖచ్చితంగా తినండి. ఇలా తినడం వల్ల శరీరంలో ఏర్పడే మార్పులను కంట్రోల్ చేయొచ్చు. పరిపూర్ణంగా ఆరోగ్యవంతులు కావొచ్చు.
- రోటీలు: గోధుమ పిండి రోటీలను మాత్రమే తినవద్దు. రాగులు, మిల్లెట్, మొక్కజొన్న, పప్పు మొదలైన పిండి రోటీలను కూడా మీ డైట్‌లో చేర్చండి. మీకు కావాలంటే ఆయా పిండి పదార్ధాలను, గోధుమ పిండితో నిర్దిష్ట నిష్పత్తిలో కలుపుకుని రోటీలు చేసుకోండి.
- పసుపు పాలు: డైట్‌లో తప్పనిసరిగా పసుపు పాలను చేర్చండి. మీ శరీరానికి కావాల్సిన కాల్షియం లభిస్తుంది. అనేక వ్యాధుల మీ దరికి రాకుండా రక్షించుకోగలుగుతారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..