New Smartphones in India: ఈ జనవరిలో లాంచ్ అవబోతున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. ఫీచర్లు చూస్తే కళ్లు జిగేల్ అనాల్సిందే..
పెద్ద పెద్ద మొబైల్ ఫోన్ బ్రాండ్‌లు 2023 జనవరిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. Vivo యొక్క అనుబంధ సంస్థ IQOO కూడా ఈ నెలలో..
కొత్త ఏడాది వచ్చేసింది. అందుకే కొత్త మోడల్‌లతో కస్టమర్ల ఆదరణ పొందేందుకు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా సిద్ధమవుతున్నాయి. 2023 మొదటి త్రైమాసికంలోనే కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో విడుదల చేయనున్నాయి ప్రముఖ గాడ్జెట్ కంపెనీలు. అయితే మారుతున్న జీవన విధానాన్ని అనుసరించి.. షాపింగ్‌కు వెళ్లడానికి సమయం, తీరిక లేకపోతుంది. అందువల్ల ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఏయే ఫోన్ మోడల్‌లను లాంచ్ చేయబోతున్నాయో మేము మీకు తెలియజేస్తాము. Vivo, Redmi, OnePlus వంటి పెద్ద పెద్ద మొబైల్ ఫోన్ బ్రాండ్‌లు 2023 జనవరిలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. Vivo యొక్క అనుబంధ సంస్థ IQOO కూడా ఈ నెలలో కొత్త ఫోన్‌తో వస్తోంది.
ఈ నెలలో లాంచ్ అవబోతున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు, వాటి ఫీచర్లు ఇంకా లాంచ్ తేదీలతో సహా పూర్తి వివరాలనున ఇక్కడ తెలుసుకుందాం..
OnePlus 11:
Make your friends green with envy.#OnePlus11 5G
Know More: https://t.co/wjbDUn6s9w pic.twitter.com/2jUssTfcx7
— OnePlus India (@OnePlus_IN) January 6, 2023
కొత్త ఏడాదిలో OnePlus తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC తో పాటు ఫోన్ 5,000mAh బ్యాటరీతో రాబోతుంది OnePlus 11. క్వాలిటీ కెమెరాకు ప్రసిద్ధి చెందిన OnePlus, ఈ ఫోన్‌లో 50MP ట్రిపుల్ బ్యాక్ కెమెరా, 16MP ఫ్రంట్ క్యామ్‌ను అందించాలని భావిస్తోంది. ఇక 6.7-అంగుళాల Quad HD+ 3D కర్వ్‌డ్ డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 7న భారతదేశంలో లాంచ్ అవుతుంది. అయితే జనవరి 4న చైనాలో అధికారిక ఆవిష్కరణ జరిగింది.
Redmi Note 12 సిరీస్:
Welcome to the most awaited launch from the house of Xiaomi. We’re bringing you not 1, not 2 but 3 #SuperNotes. Envision history being made yet again, with the #RedmiNote12 5G Series. Come join us! https://t.co/tcbe1nuttB
— Redmi India (@RedmiIndia) January 4, 2023
ఎంతోకాలం నుంచి భారత్‌లో టాప్ బ్రాండ్‌గా ఉన్న రెడ్‌మి మరో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తో రాబోతుంది. ఈ కొత్త ఫోన్ కూడా భారతదేశంలో బాగా రాణిస్తుందని కంపెనీ భావిస్తోంది. Redmi Note 12 సిరీస్ 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాక డాల్బీ విజన్ సపోర్ట్, కేవలం 15 నిమిషాల్లో వేగంగా ఛార్జ్ అవడం దీని ప్రత్యేకతలు. ఇక స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 17,999 కాగా, ఈ జనవరి 4న లాంచ్ అయింది.
IQOO 11 సిరీస్:
The myth is real. And so is the monster. Get ready to meet the #MonsterInside #WorldsFastestSmartphone – #iQOO 5G on 10.01.23. Block you date, set your clocks and mark your calendars because a “Legend” is coming. Coming soon.
Know More – https://t.co/ldf4ieXtR1#AmazonSpecials pic.twitter.com/KjgS9KJ2Gf
— iQOO India (@IqooInd) January 3, 2023
ప్రముఖ Vivo కంపెనీకి iQOO సబ్ బ్రాండ్. ఈ ఏడాది జనవరి10న భారత్‌లో Snapdragon 8 Gen 2 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌తో మొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది iQOO. ఇక iQOO 11లో 6.78-అంగుళాల LTPO4 AMOLED 2K+ డిస్‌ప్లే, 16GB వరకు RAM, 512GB ఇంటర్నల్ మెమోరి వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
మోటరోలా ఎడ్జ్ 40 సిరీస్:
Treat yourself with the #motoe40, now at an unbeatable price. Ensure your entertainment goes uninterrupted with a fluid 90Hz Punch-hole Display and a powerful 5000mAh Battery. Head to @flipkart and get yours now. Hurry! Offer valid till 31st Dec. only.
— Motorola India (@motorolaindia) December 30, 2022
Motorola ద్వారా ఈ ఏడాది రాబోతున్న ఎడ్జ్ 40 సిరీస్ 6.65-అంగుళాల ఫుల్ HD+ కర్వ్‌డ్ OLED డిస్‌ప్లేతో ఉంటుంది. ప్రారంభ మోడల్ 125W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఎడ్జ్ 40 ప్రారంభ ధర రూ. 27,990 ఉండగా ఇది జనవరి 22 నాటికి భారత్‌లో లాంచ్ అవుతుంది.
Vivo X90:
The finest curvature for an immersive experience. Get a 6.78-inch 3D Curved LTPO display with the #vivoX80Series to redefine your perspective.#MyLifeIsAMovie #CinematographyRedefined pic.twitter.com/nfzn1PNZum
— vivo India (@Vivo_India) January 5, 2023
భారత్‌లో గత కొంత కాలంగా రాణిస్తున్న టాప్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో వీవో కూడా ఒకటి. ప్రతి సంవత్సరం కొత్త కొత్త మోడల్ ఫోన్‌లతో వచ్చే వీవో ఈ ఏడాది Vivo 6.78-అంగుళాల కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లేతో వీవో X90, X90 Pro+లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. టాప్-టైర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌తో ఉన్న ఈ ఫోన్ క్వాడ్ వెనుక కెమెరాలు, 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అవగా మన దేశంలో జనవరి 31న విడుదలవుతుందని సమాచారం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..