ఆర్థిక క్రమ శిక్షణ పాటించడం లేదా.. వెంటనే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. లేకుంటే భవిష్యత్తు అప్పులమయమే..

సంపాదన అనేది జీవితంలో కొంతకాలం మాత్రమే చేయగలం.. కాని ఖర్చులు మొత్తం వ్యక్తి బతికున్నంత వరకు ఉంటాయి. మనం సంపాదించే ఆదాయం లేదా జీతంలో భవిష్యత్తు కోసం కూడా పొదుపు చేయాలని చాలామంది చెబుతుంటారు. కొంతమంది ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకుంటే.. మరికొంతమంది

ఆర్థిక క్రమ శిక్షణ పాటించడం లేదా.. వెంటనే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. లేకుంటే భవిష్యత్తు అప్పులమయమే..
Saving
Follow us
Amarnadh Daneti

|

Updated on: Jan 07, 2023 | 8:00 AM

సంపాదన అనేది జీవితంలో కొంతకాలం మాత్రమే చేయగలం.. కాని ఖర్చులు మొత్తం వ్యక్తి బతికున్నంత వరకు ఉంటాయి. మనం సంపాదించే ఆదాయం లేదా జీతంలో భవిష్యత్తు కోసం కూడా పొదుపు చేయాలని చాలామంది చెబుతుంటారు. కొంతమంది ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకుంటే.. మరికొంతమంది మాత్రం పొదుపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తీరా రిటైర్మెంట్ తర్వాత.. పరిస్థితులను చూసి బాధపడుతూ ఉంటారు. గతంలో నేను ఇలా చేసి ఉంటే ప్రస్తుతం నా పరిస్థితి బాగుండేది కదా అని అనుకుంటాం. అదే మొదటినుంచి పొదుపును అలవాటు చేసుకున్న వారి భవిష్యత్తు మాత్రం బంగారుమయం అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. పొదుపు చేయడం ఒకటేతే మనం పొదుపును ఎలా చేస్తున్నాం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఈ అంశంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం కొన్ని సందర్భాల్లో మన డబ్బులను నష్టపోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ పొదుపు చేసే ముందు అన్ని విషయాలను ఆలోచించుకోవడంతో పాటు.. ఏ పద్ధతిలో పొదుపు చేయాలనుకుంటున్నామో తెలుసుకోవాలి.

ఎంత పొదుపు చేయాలి..

పొదుపు చేయడంతో పాటు నెలకు నెలకు తగిన మొత్తంలో పొదుపు చేస్తున్నామా లేదా అనేది ముఖ్యమైన అంశం నెలవారి ఆదాయంలో కనీసం 30 శాతం మదుపు చేస్తే అది మన భవిష్యత్తు అవసరాలకు సరిపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అయితే ప్రావిడెంట్ ఫండ్ రూపంలో కొంత మొత్తం ముందే పొదుపు అవుతుంది. కాబట్టి జీతం ద్వారా చేసే మదుపు మన ప్రస్తుత జీవన విధానాన్ని కొనసాగించడానికి సరిపోతుంది.

పొదుపు లక్ష్యం

ప్రతీ ఏడాది జనవరి నెలలో చాలామంది ఉద్యోగులు, తాము పని చేసే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ దాఖలు చేసే సమయంలో పొదుపు గురించి ఆలోచిస్తారు. సెక్షన్ 80సీ ద్వారా కలిగే రిబేటు కోసం ఎంతో కొంత పొదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇది సరైన నిర్ణయం కాదంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్. మన భవిష్యత్తుకు భరోసా అనే ఆలోచనతోనే పొదుపు చేయాలి.

ఇవి కూడా చదవండి

ఆర్థిక క్రమశిక్షణ

మనం మదుపు చేసే మొత్తం మన ఆర్థిక క్రమశిక్షణ ఫలితం అనే విషయం మర్చిపోకూడదు. క్రమశిక్షణతో కూడిన జీవితం ఆరోగ్యానికి ఎంత మంచిదో అలాగే ఆర్థిక క్రమశిక్షణ కూడా మన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడుతుంది.

వివిధ మార్గాలలో మదుపు

పొదుపు అనేది దీర్ఘకాలికమైన అంశం. అయితే మదుపు చేసే ప్రతీ మార్గంలో ఎంతో కొంత రిస్క్ కూడా ఉంటుంది. అయితే జాతీయ బ్యాంకుల్లో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లో ఎలాంటి రిస్క్ ఉండదు అనుకుంటాం కానీ అందులో కూడా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. అందుకే మదుపు మొత్తం ఒక మార్గం ద్వారా కాకుండా విభిన్న మార్గాల్లో చేయాలి. ఈ అలవాటు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒక పొదుపు మార్గం ద్వారా నష్టం వచ్చినా, మరో మార్గం ద్వారా లాభం వస్తే మొత్తంగా మన ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది రాకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక రంగంలో సంక్షోభం ఉన్న సమయంలో మరో రంగం బాగా రాణించవచ్చు. ఆ విధంగా మన రిస్క్ తగ్గించుకోవచ్చు.

ఆర్థిక లక్ష్యాలకు తగిన మదుపు

మన ఆర్థిక లక్ష్యాలకు మనం చేసే మదుపుకు మధ్య సమన్వయం ఉండాలి. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే అటు మదుపు మీద వచ్చే రాబడి, ఇటు మన అవసరాలు కూడా కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. అందువల్ల మన ఆర్థిక లక్ష్యాలను కూడా మూడు రకాలుగా విభజించుకుని తగిన పొదుపు మార్గాలు ఎంచుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..