Insurance: ఇన్సూరెన్స్ డబ్బు కోసం దారుణం.. టీ లో విషం కలిపి బాలుడిని చంపిన సవతి తల్లి..
సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు మంటగలుస్తున్నాయి. మనీ కోసం మనవాళ్లు అనే ఆలోచన కూడా లేకుండా చేస్తున్నారు. డబ్బు కోసం సొంత వాళ్లపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. తాజాగా.. మధ్యప్రదేశ్ లో...
సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు మంటగలుస్తున్నాయి. మనీ కోసం మనవాళ్లు అనే ఆలోచన కూడా లేకుండా చేస్తున్నారు. డబ్బు కోసం సొంత వాళ్లపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. తాజాగా.. మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ సవతి తల్లి.. బాలుడికి టీలో విషం ఇచ్చి చంపేసింది. చివరికి పోలీసుల విచారణలో చిక్కి కటకటాలపాలైంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలో ఉన్న మురార్ ప్రాంతలో రాజు పరిహార్ నివాసముంటున్నాడు. అతని భార్య సీమ.. రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. దీంతో అతడు ఆరాధన అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. సీమ ఇన్సూరెన్స్క్లెయిమ్ డబ్బులు రూ. 8 లక్షలు వచ్చాయి. వాటిని సీమ కుమారుడు నితిన్పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్చేశాడు. ఆ డబ్బును ఎలాగైనా కాజేయాలని అనుకున్న అరాధన.. రాజు లేని సమయంలో నితిన్‌కు విషం కలిపిన టీని ఇచ్చింది.
రాజు వచ్చేసరికి బాలుడి ఆరోగ్యం విషమించింది. వెంటనే అలర్ట్ అయ్యి.. బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సవతి తల్లి ఇచ్చిన టీ వల్లనే ఇలా అయిందని బాలుడు చెప్పాడు. ఆ తర్వాత కొంత సమయం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడి మృతి కి కారణమైన ఆరాధనపై భర్త.. రాజు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ ఘటన 22 సెప్టెంబర్ 2021లో జరిగింది. కాగా, ఈ కేసుపై విచారణ చేపట్టిన అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు.. ఆరాధనను దోషిగా తేల్చింది. ఆమెకు జీవిత ఖైదు విధించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..