మధ్యాహ్న భోజనం చేస్తుండగా వివాదం.. ఒకరిపైఒకరు వేడినీళ్లు పోసుకున్న మహిళలు..
వారందరూ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తుంటారు. నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించడం వారి బాధ్యత. అలా అని.. వారు విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించారనుకుంటే తప్పులో కాలేసినట్లే.. అలా ఏమీ జరగలేదు...
వారందరూ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తుంటారు. నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించడం వారి బాధ్యత. అలా అని.. వారు విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించారనుకుంటే తప్పులో కాలేసినట్లే.. అలా ఏమీ జరగలేదు. కానీ.. వారి మధ్యే చిచ్చు రేగింది. ఒక గ్రూప్ నకు చెందిన వారే వంట చేస్తున్నారని మరో వర్గం వారు ఫైర్ అయ్యారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అంతే కాకుండా ఒకరిపైమరొకరు వేడి నీళ్లు పోసుకునేంత వరకు వెళ్లింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లా భగవంగోలా ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో మహిళల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర కోపంలో వారు ఒకరిపై ఒకరు వేడినీళ్లు పోసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వంట సామాగ్రి చోరీకి పాల్పడ్డారంటూ మహిళల మధ్య వాగ్వాదం జరగడంతో ఈ ఘటన జరిగింది.
మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కొన్ని స్వయం సహాయక సంఘాల మహిళలు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం వంట చేస్తున్నారు. అయితే వారిలో కొందరికి మాత్రమే శాశ్వత ఉపాధి కల్పిస్తున్నారని పలువురు ఆరోపించారు. కొద్ది రోజులుగా 20 మంది మహిళలు పనిచేస్తున్నారు. దీంతో మిగిలిన వారికి అవకాశం దక్కలేదు. దీనిపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మహిళలు వంట చేస్తుండగా.. మరో స్వయం సహాయక సంఘం మహిళలు వచ్చారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం సమయంలో మాటా మాటా పెరిగి వేడినీళ్లు పోసుకున్నారు.
ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఆర్తనాదాలతో పాఠశాల ప్రాంగణం రణరంగంగా మారింది. ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు భయంతో వణికిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు.. ఘటనను తీవ్రంగా తీసుకున్నారు. గొడవకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి