AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro tips: మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తే దరిద్రం వెంటపడినట్టే..! తస్మాత్‌ జాగ్రత్త..

బయటి వ్యక్తి కన్ను మనీ ప్లాంట్‌పై పడితే ఆ మొక్క ఎదుగుదల ఆగిపోతుందని అంటున్నారు. అంతే కాదు, దాని ప్రభావం వ్యక్తి ఆర్థిక స్థితిపై కూడా కనిపిస్తుంది. ఈ మొక్కను ఎల్లప్పుడూ

Astro tips: మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తే దరిద్రం వెంటపడినట్టే..! తస్మాత్‌ జాగ్రత్త..
Money Plant
Jyothi Gadda
|

Updated on: Jan 11, 2023 | 8:01 PM

Share

న్యూఢిల్లీ: వాస్తుశాస్త్రంలో అనేక చెట్లు, మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రస్తావించారు. వీటిని ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో అలంకరణతో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా ఆ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వస్తుందని ఒక నమ్మకం. అలాంటి మొక్కలలో మనీ ప్లాంట్ ఒకటి. ఇది దాదాపు అన్ని ఇళ్లలో కనిపిస్తుంది. అయితే ఇంట్లో పెట్టుకునే ముందు మనీప్లాంట్‌కు సంబంధించి వాస్తు నియమాలు తెలుసుకోవడం చాలా అవసరమని వాస్తు నిపుణులు అంటున్నారు. మనీ ప్లాంట్‌ను నాటేటప్పుడు ఎవరైనా పొరపాటు చేస్తే.. ఫలితంగా ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు. తప్పుడు దిశలో నాటిన మనీ ప్లాంట్ ఏ వ్యక్తినైనా ధనవంతుడిగా కాకుండా పేదవాడిని చేస్తుంది. దీనితో పాటు అనేక రకాల సమస్యలు వ్యక్తిని చుట్టుముడతాయి. మనీ ప్లాంట్‌ను నాటేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మనీ ప్లాంట్‌కు సంబంధించి అతి ముఖ్యమైన నియమాలు..

– వాస్తు శాస్త్రంలో మనీప్లాంట్‌కు ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతను ప్రస్తావించారు. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనీప్లాంట్ ఈశాన్య దిశలో నాటకూడదు. ఎవరైనా ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభం తప్పదు.

– మనీప్లాంట్ ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో నాటాలి. ఈ దిక్కును వినాయకునికి దిక్కుగా పరిగణిస్తారు. ఈ దిశలో మనీ ప్లాంట్‌ను నాటడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

– మనీ ప్లాంట్ పెరిగే కొద్దీ మనిషి కూడా పెరుగుతాడని అంటారు. కాబట్టి మనీప్లాంట్ మొక్క తీగ ఎప్పుడూ నేలను తాకకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మనీప్లాంట్‌ తీగ నేలను తాకినట్లయితే, వ్యక్తి డబ్బును కోల్పోతాడని అంటారు.

– మనీప్లాంట్ ఎండిపోకుండా చూసుకోవాలి. దాని ఆకులు ఎండిపోయినా లేదా పసుపు రంగులోకి మారితే, వెంటనే దాన్ని తొలగించండి. ఎండిన మనీప్లాంట్ ఇంటికి దురదృష్టాన్ని తెస్తుందని చెబుతారు.

– ఇంటి బయట మనీ ప్లాంట్ పెట్టకూడదని కూడా అంటారు. బయటి వ్యక్తి కన్ను మనీ ప్లాంట్‌పై పడితే ఆ మొక్క ఎదుగుదల ఆగిపోతుందని అంటున్నారు. అంతే కాదు, దాని ప్రభావం వ్యక్తి ఆర్థిక స్థితిపై కూడా కనిపిస్తుంది. ఈ మొక్కను ఎల్లప్పుడూ ఇంటి లోపల పెట్టుకోవాలి.

– మనీప్లాంట్ అమ్మడం అశుభం అంటున్నారు వాస్తు నిపుణులు . ఇలా చేయడం వల్ల శుక్రుడికి కోపం వస్తుంది. ఈ కారణంగా, వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

మరిన్ని వాస్తు సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..
జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్
జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు
దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్