AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puri Teen Murder Case: కూతురిని చంపి రాత్రికి రాత్రే తగులబెట్టిన తల్లిదండ్రులు! కారణం ఏంటో తెలుసా?

తండ్రి దుర్గాచరణ్ తన మొదటి భార్య 2018లో మరణించిన తర్వాత 2020లో మమతా ఓజా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. 2వ పెళ్లి తర్వాత సోనాలిని ఆమె తండ్రి, సవతి తల్లి, ఆమె సోదరుడు జీవన్..

Puri Teen Murder Case: కూతురిని చంపి రాత్రికి రాత్రే తగులబెట్టిన తల్లిదండ్రులు! కారణం ఏంటో తెలుసా?
Crime News
Jyothi Gadda
|

Updated on: Jan 11, 2023 | 6:05 PM

Share

ఒడిశాలోని పూరీ జిల్లాలోని గోప్ ప్రాంతంలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు 17 ఏళ్ల కుమార్తెను తండ్రి, సవతి తల్లి కలిసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని రాత్రికి రాత్రే తగులబెట్టినట్లు సమాచారం. మృతురాలిని సోనాలి మోహరానాగా గుర్తించారు . ఆమె అక్క రంజిత మోహరానా ఫిర్యాదు మేరకు గోప్‌ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు తండ్రి దుర్గాచరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నివేదికల ప్రకారం, నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రి దుర్గాచరణ్ తన మొదటి భార్య 2018లో మరణించిన తర్వాత 2020లో మమతా ఓజా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. 2వ పెళ్లి తర్వాత సోనాలిని ఆమె తండ్రి, సవతి తల్లి, ఆమె సోదరుడు జీవన్ ఓజా తరచూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని మృతురాలి సోదరి రంజిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది.

సోనాలి మరణవార్త విని గ్రామానికి వచ్చిన రంజిత.. అనంతరం తన చెల్లెలును హత్య చేసిన దుర్గాచరణ్, మమత, జీవన్ లను అరెస్ట్ చేయాలని గోప్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు సోమవారం అర్థరాత్రి సోనాలిని హత్య చేసి సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మృతదేహాన్ని గ్రామంలోని శ్మశాన వాటికలో దహనం చేసి బూడిదను దాచారని ఆమె ఆరోపించారు . ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..