Island: రోడ్డు సౌకర్యంలేని ఊరు.. హెలికాఫ్టర్‌లో నిత్యవసరాలు.. చిన్న సబ్బు ధర రూ. 3500..! ఎక్కడో తెలుసా..?
వాహనాల రాకపోకలు లేవు. కాబట్టి ఇక్కడ నివసించడానికి అవసరమైన ప్రాథమిక వస్తువులను హెలికాప్టర్ ద్వారా అందజేస్తారు. ప్రతి వారం, హెలికాప్టర్ ద్వారా బట్టలు, ఆహారం, ఇంధనం వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తారు. కొన్నిసార్లు అవసరమైన వస్తువులు
ప్రపంచం చాలా విశాలమైనది. ఈ ప్రపంచంలో మనకు తెలియని ప్రదేశాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు అంతుచిక్కని రహస్యాలు, అద్భుతాలతో నిండి ఉన్నాయి. భారతదేశంలో సరైన రోడ్డు సౌకర్యం లేదని, ప్రతి రెండు గంటలకు ప్రభుత్వ బస్సులు నడవడం లేదని, బ్యాంకులు, హోటళ్లు, పాఠశాలలు సరిగా లేవని పోరాటాలు జరుగుతున్నాయి. అయితే ప్రపంచంలో ఈ సౌకర్యాలేవీ అనేక ప్రాంతాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా..? అది కూడా అగ్రరాజ్యం అమెరికాలో వాహన సౌకర్యం మాత్రమే కాదు, రెస్టారెంట్, బ్యాంక్ అన్న ఊసేలేని గ్రామం ఒకటి ఉంది.. అక్కడ కొద్ది మంది మాత్రమే ఉంటారు.. వీరికి హెలికాప్టర్‌లో ఆహారం సరఫరా చేస్తారు. ఆ ప్రాంతం ఏమిటి? ఎందుకు ఇంత వెనుకబడి ఉందో ఇక్కడ తెలుసుకుందాం…
ఆ ఊరు పేరు లిటిల్ డియో మెయిడ్ ఐలాండ్, ఇక్కడ చాలా తక్కువ మంది జీవిస్తుంటారు. రవాణా సౌకర్యం ఉండదు. బ్యాంకు లేదు, హోటల్ లేదు. ఇది అమెరికాలోని నిర్జన ద్వీపం. లిటిల్ డియో మేడ్ ఐలాండ్ నుండి రష్యా సరిహద్దు కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్వీపంలో కేవలం 80 మంది మాత్రమే నివసిస్తున్నారు.
ఇక్కడి ఉష్ణోగ్రతలు.. ఈ ద్వీపంలో గంటకు దాదాపు 144 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. శీతాకాలంలో ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత -14 డిగ్రీలు ఉంటుంది. వేసవిలో, ఇక్కడ ఉష్ణోగ్రత 10 డిగ్రీల వరకు ఉంటుంది. రష్యన్ ద్వీపం లిటిల్ డియో మెయిడ్ ద్వీపానికి సమీపంలో ఉంది. ఈ రెండు దీవుల మధ్య ఉండే నీరు శీతాకాలంలో మంచు వంతెనలా మారుతుంది. ఈ వంతెన ద్వారా ప్రజలు ఒక ద్వీపం నుండి మరొక ద్వీపానికి ప్రయాణిస్తారు. లిటిల్ డియో మెయిడ్ ఐలాండ్ మాననివాసాలకు అంత సురక్షితం కాదు. అక్కడ భయంకరమైన జంతువులు ఉన్నాయని చెబుతారు.
ద్వీపం ప్రత్యేకతలు.. లిటిల్ డియో మెయిడ్ ఐలాండ్ చాలా ప్రత్యేకమైనది. ద్వీపంలోని భవనాలు 1970ల నుండి 1980ల మధ్య కాలంలో నిర్మించినట్టుగా సమాచారం. ఈ భవనాలలో పాఠశాల, లైబ్రరీ ఉన్నాయి. పాఠశాలలో ఒకే ఒక్క వైఫై సౌకర్యం ఉంది.
కావాల్సినవన్నీ హెలికాప్టర్ ద్వారా అందిస్తారు.. ఇక్కడ సరైన రహదారి లేదు. ఈ ద్వీపంలో వాహనాల రాకపోకలు లేవు. కాబట్టి ఇక్కడ నివసించడానికి అవసరమైన ప్రాథమిక వస్తువులను హెలికాప్టర్ ద్వారా అందజేస్తారు. ప్రతి వారం, హెలికాప్టర్ ద్వారా బట్టలు, ఆహారం, ఇంధనం వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తారు. కొన్నిసార్లు అవసరమైన వస్తువులు ఓడ ద్వారా ప్రజలకు పంపిణీ చేయబడతాయి.
డిష్ వాషింగ్ సోప్ ఖరీదు ఎంతో తెలుసా? .. ఇక్కడ పదార్థాలు హెలికాప్టర్, షిప్ ద్వారా రావాల్సిందే.. అందుకే ఖర్చు ఎక్కువ. దీంతో ఇక్కడి ప్రజలు అధిక ధరలు చెల్లించి వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. భారతదేశంలో 10 -20 రూపాయల మధ్య ఉండే ఒక డిష్‌వాషింగ్ సబ్బు ఈ ద్వీపంలో దాదాపు 3500 రూపాయలు. లాండ్రీ పౌండర్ ధర కూడా నాలుగు వేల కంటే ఎక్కువ ధరలో దొరుకుతుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..