Trending Video: ఇతనే రియల్ బాహుబలి.. కారును అమాంతం ఎత్తి పడేశాడు.. నమ్మకం లేదా.. అయితే వీడియో చూసేయండి..
నగరాల్లోని రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రాఫిక్ లో చిక్కుకుంటే పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లే.. ముందుకు వెళ్లలేక, వెనక్కు రాలేక.. నత్తనడకన సాగిపోతుంటారు. కార్లు, భారీ వాహనదారుల పరిస్థితి...
నగరాల్లోని రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రాఫిక్ లో చిక్కుకుంటే పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లే.. ముందుకు వెళ్లలేక, వెనక్కు రాలేక.. నత్తనడకన సాగిపోతుంటారు. కార్లు, భారీ వాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇక వారి పార్కింగ్ కష్టాలు వర్ణనాతీతం. పార్కింగ్ ప్లేస్ దొరక్క కొందరు, పార్క్ చేసిన కారును బయటకు తీయలేక మరికొందరు అష్టకష్టాలు పడుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కానీ ఇందులో.. ఓ వ్యక్తి తన కారును పార్కింగ్ స్థలంలో నిలిపేందుకు ఏం చేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే.
వైరల్ అవుతున్న వీడియోలో.. రోడ్డు పక్కన చాలా కార్లు పార్క్ చేసి ఉండటాన్ని మీరు చూడవచ్చు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి బ్లాక్ రంగు కారును బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ వీలు కాలేదు. దీంతో ఏం చేయాలో తెలియకు ఆయన ఓ పెద్ద సాహసమే చేశాడు. సైకిల్ ను ఎత్తినంత సులభంగా కారును ఎత్తేశాడు. కారు వెనక భాగాన్ని ఎత్తి.. అక్కడి నుంచి చాకచక్యంగా బయటకు తీశాడు.
excellent output pic.twitter.com/MBIM9GJM1w
— Great Videos (@Enezator) January 9, 2023
ఈ అద్భుతమైన వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. వీడియో రాసే సమయానికి.. 12 లక్షలకు పైగా వ్యూస్.. 19 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వీడియో చూసేందుకు చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. అతని బలానికి సలాం కొడుతున్నారు. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.