Kite Making: గాలిపటాలు తయారు చేయడం ఎలాగో తెలుసా.. మాంజా కట్టడం నుంచి పతంగీ రెడీ చేసేవరకు.. అన్నీ మీరే ఇలా చేయ్యొచ్చు..

సంక్రాంతి పండుగ రానే వచ్చింది. విద్యార్థులకు సెలవులు కూడా మొదలయ్యాయి. దీంతోపాటు పతంగుల సందడి మొదలైంది. అంతటా గాలి పటాల సందడిగా మారిపోయింది. అయితే ఈ పతంగులను ఎలా తయారు చేయాలి..? గాలి పటాలకు పాసాంగం ఎలా కట్టాలనేది ఇక్కడ తెలుసుకుందాం..

Kite Making: గాలిపటాలు తయారు చేయడం ఎలాగో తెలుసా.. మాంజా కట్టడం నుంచి పతంగీ రెడీ చేసేవరకు.. అన్నీ మీరే ఇలా చేయ్యొచ్చు..
Easy Way To Tie Kite To Manja
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 11, 2023 | 4:36 PM

సంక్రాంతి పండుగ అంటే సందడి. సంక్రాతి పండగ వచ్చిందంటే చాలు.. అంతటా గాలి పటాల సందడి ఉంటుంది. దేశమంతా వేర్వేరు పేర్లతో పండగ జరుపుకున్నా పతగులు మాత్రం కామన్. సంకాంతికి ముందుగా గుర్తుకు వచ్చేవి చకినాలు, అర్షలు, పతంగులే.. తెలంగాణ మొత్తం  దాదాపుగా ఇదే సందడి కనిపిస్తుంది. తెలంగాణలో మాత్రమే కాదు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ పతంగలు ఎగురవేస్తుంటారు. పొంగల్ పండగ వేళ దేశమంతటా రంగు రంగుల పతంగులు ఎగురవేస్తుంటారు. పతంగులు ఎగరేయడంలో పిల్లలతోపాటు పెద్దలు కూడా చేరిపోతారు. డిసెంబర్‌ నెలలో మొదలయ్యే పతంగులు జనవరి చివరి దాకా కొనసాగుతుంది.

బాగా వెలుతురు, గాలులు వీచే రోజులు డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి చివరి వారం వరకు వీస్తుంటాయి.  గాలిపటం ఎగురవేయడం వల్ల కలిగే ఆనందం వేరే లెవల్ అని చెప్పవచ్చు. కొని తెచ్చుకున్న గాలిపటం కంటే మనలో చాలా మంది స్వయంగా తయారు చేసుకుంటారు. అయితే కొని తెచ్చుకున్న పతంగికి కూడా పాసాంగం కట్టుకోవాల్సింది మాత్రం మనమే. ఇలా మీ స్వంతంగా తయారు చేసిన గాలిపటాన్ని ఎగురవేయండి! సరళమైన డైమండ్ ఆకారపు గాలిపటం తయారు చేయడం అనేది మీరు కేవలం కొన్ని గంటల్లో పూర్తి చేయగల సులభమైన ప్రాజెక్ట్.  ఫ్రేమ్‌ను ఎలా నిర్మించాలో, గాలిపటం తెరచాప లేదా షీర్‌ను ఎలా నిర్మించాలో దానిని కలిసి ఉంచడం ఎలాగో మీకు చూపుతుంది. అప్పుడు, మీరు మీ చేతితో తయారు చేసిన గాలిపటాన్ని ఆకాశంలో ఎగురవేయడం ఆనందించవచ్చు. అయితే, వీటిని మీరే ఇంట్లో తయారు చేసి ఎగరేస్తే ఎంతో బాగుంటుంది కదా.. ఆ తయారీ ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

పతగుల(గాలి పటం) తయారీకి కావాల్సిన వస్తువులు:

  • కలర్ పేపర్ – 1 షీట్ (లేకుంటే ఏదైన న్యూస్ పేపర్)
  • ఫెవీకాల్ -1
  • కొబ్బరి చీపురు పుల్లలు – 3(వెదురు పుల్లలు)
  • టేప్ -1 (లేకుంటే గమ్)

పతంగి తయారీ చేసే పద్దతి..

ఇప్పుడు పేపర్‌‌ని సరిగ్గా త్రిభుజం ఆకారంలో మడతపెట్టి.. ఎక్కువగా ఉన్న పేపర్‌ని కట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఆ చతురస్ర ఆకారంలో పేపర్ రెడీ అవుతుంది. ఇప్పుడు చీపురు పుల్లకి లేదా వెదురు ఫెవికాల్ రాసి పేపర్‌ని రెండు త్రిభుజాలుగా విడదీసే విధంగా మధ్యలో అతికించాలి లేదా మీరు తెచ్చుకున్న టేప్‌‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి అతికించండి. తర్వాత.. ఇంకో చీపురుపుల్లని మధ్యలో అతికించిన పుల్లకి అడ్డంగా అటు చివర ఇటు చివర పైకి వలయకారంలో వచ్చేటట్టు టేప్ అతికించాలి. ఇప్పుడు దానికి కిందివైపున ఒక పేపర్‌తో ఎండింగ్‌లా చేసి తోకని అతికించాలి.. దీనికి దారం కడితే సరి.. గాలిపటం సిద్దమవుతంది..

పెద్దపెద్దగాలిపటాలను మడతపెట్టటానికి వీలుగా మడతకీళ్ళ (హింజ్ ) లతో తయారుచేస్తారు. ఎటుచూసినా ఒకే మాదిరిగా ఉండే గాలిపటాల ముక్కును గాలివీచేదిశలో వుంచటానికి తోకను వాడతారు. మన ఇష్టాన్ని బట్టి.. పేపర్‌తో కానీ, స్టైలిష్ కలర్ ప్లాస్టిక్ పేపర్‌తో కాని తయారు చేసుకోవచ్చు. అంతేకాదు.. డిజైన్స్‌ని కూడా మన ఇష్టంగా కట్ చేసుకోవచ్చు. కానీ చీపురు పుల్లలు మాత్రం ఈ విధంగానే పెట్టాలి…

అయితే గాలిపటం ఇంట్లో తయారు చేసుకున్న బయట కొని తెచ్చుకున్న అసలు ముఖ్యమైనది మాత్రం దానికి కంటే దారం లేదా మాంజా. ఇది అత్యంత కీలకం. ఎందుకంటే ఇది సరిగ్గా కడితేనే పతంగి గాలిలోకి లేస్తుంది.  అయితే ముందుగా మీరు వెదురు పుల్లలు కట్టిన వైపు నుంచి కాకుండా మరో వైపు మాంజా కట్టాల్సి ఉంటుంది. ఇలా సరైన కొలతలతో మాంజా కట్టాల్సి ఉంటుంది.

మరింకెందుకు ఆలస్యం.. మీరే తయారు చేసి మీ ఇంట్లోనివారికి గిఫ్ట్‌గా ఇవ్వండి. అంతేకాదు మీ చిన్నారులకు నేర్పించండి..

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!