Telugu News » Health » Tips to Sugar Patients in the view of corona pandemic increasing with new Covid variant
Sugar Tips: షుగర్ వ్యాధిగ్రస్తులకు సూపర్ టిప్స్..కోవిడ్ పెరిగిన సమయంలో ఇవి ఖచ్చితంగా పాటించాల్సిందే
TV9 Telugu Digital Desk | Edited By: Anil kumar poka
Updated on: Jan 11, 2023 | 1:51 PM
ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశమైన భారత్ కూడా కరోనా నిబంధనలు పాటించాలని పౌరులకు సూచిస్తుంది. మధుమేహం, గుండె సమస్యలు, రక్తపోటు, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Diabetes
కరోనా మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న పదం. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ అతాలాకుతలమైంది. అలాగే రెండో వేవ్ సమయంలో ఊహించని రీతిలో మరణాలు సంభవించాయి. కరోనా సమయంలో ముఖ్యంగా షుగర్ వ్యాధి గ్రస్తులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్న వారు చలా భయపడ్డారు. ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశమైన భారత్ కూడా కరోనా నిబంధనలు పాటించాలని పౌరులకు సూచిస్తుంది. మధుమేహం, గుండె సమస్యలు, రక్తపోటు, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కరోనాబారిన పడితే తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ ప్రాణాంతకమైన సమస్యగా మారుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. షుగర్ తో ఉన్నవారికి ఉండే బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా వారు చాలా ఈజీగా అంటువ్యాధులు బారిన పడతారు. కరోనా కూడా అంటువ్యాధే కాబట్టి వారు సులభంగా కరోనాకు గురవుతారు. ఈ కరోనా భయాల నేపథ్యంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
సబ్బుతో చేతులు కడుక్కోవడం లేదా చేతులను శుభ్రపరచడం మొదలైన వాటికి సంబంధించి భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రామాణిక ప్రోటోకాల్, మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలి.
వీలైనంత వరకు బయటికి వెళ్లడం మానుకోవాలి. తప్పనిసరై బయటకు వెళ్తే కచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలి. మీ మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే డయాబెటీస్ మందులు తగినంత స్టాక్ పెట్టుకోవడం ఉత్తమం.
రక్తంలో చక్కెర శాతాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. షుగర్ లెవెల్స్ పెరిగితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మందులు, ఔషధాలను ప్రభుత్వం నిరంతరాయంగా సరఫరా చేస్తుంది. కాబట్టి, భయంతో మందులు మరియు సరఫరాలను ఎక్కువగా నిల్వ చేయవద్దు.
ఎలాంటి పరిస్థితుల్లో సొంత వైద్యం చేయకూడదు. ఏదైనా మందులను ఉపయోగించే ముందు ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
డయాబెటిక్ కీటోయాసిడోసిస్ సంకేతాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి.. ఈ పరిస్థితి మధుమేహం ఉన్నవారిలో, చాలా తరచుగా టైప్ 1 డయాబెటిస్ రోగుల్లో ప్రాణాంతక సమస్యలను అభివృద్ధి చేస్తుంది. శరీరంలో గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడానికి తగినంత ఇన్సులిన్ లేనప్పుడు ఇది సంభవించవచ్చు, ఇది కొవ్వుల విచ్ఛిన్నానికి కారణమవుతుంది. రక్తంలో కీటోన్స్ అని పిలువబడే ఆమ్లాల నిర్మాణానికి దారితీస్తుంది.
కరోనా సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం తప్పనిసరి. కాబట్టి మధుమేహం ఉన్నవా శారీరక శ్రమలు మానేసి ఇంట్లోనే వ్యాయామం చేయాలి.
ప్రతిరోజూ పోషకాహారం తీసుకోవాలి. అలాగే డీప్‌ఫ్రైడ్ ఫుడ్స్‌ను నివారించాలి. కరోనా నేపథ్యంలో తరచూ వైద్యుడికి టచ్ లో ఉంటూ షుగర్ లెవెల్స్ గురించి తెలియజేస్తే మంచిది.