Sunflower Seeds: పొద్దుతిరుగుడు విత్తనాలతో ఎన్ని లాభాలో.. తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..

ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను నిత్యం తినాల్సి ఉంటుంది. అలాంటి ఆహారాలు కూడా మ‌న‌కు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ఆహారలు ఒక వైపు శ‌రీరానికి పోష‌కాల‌ను అందిస్తూనే  మరోవైపు శ‌క్తిని..

Sunflower Seeds: పొద్దుతిరుగుడు విత్తనాలతో ఎన్ని లాభాలో.. తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..
Sunflower Seeds
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 11, 2023 | 12:23 PM

ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను నిత్యం తినాల్సి ఉంటుంది. అలాంటి ఆహారాలు కూడా మ‌న‌కు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ఆహారలు ఒక వైపు శ‌రీరానికి పోష‌కాల‌ను అందిస్తూనే  మరోవైపు శ‌క్తిని ఇస్తాయి. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు కావలసిన రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి. అలాంటి ఆహారాల్లో పొద్దు తిరుగుడు విత్త‌నాలు కూడా ప్రముఖమైనవి. ఇవి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ ప‌డడమే కాక అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. ఈ క్ర‌మంలోనే పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తిన‌డం వల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  1. అధిక బ‌రువు: పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపడమే కాక మెట‌బాలిజాన్ని పెంచుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖర్చయి, కొవ్వు క‌రుగుతుంది. అందువల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు క‌చ్చితంగా పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను రోజూ తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుంది.
  2. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌: జీర్ణ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు నిత్యం పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. వీటిల్లో ఉండే ఎంజైమ్‌లు మ‌ల‌బ‌ద్ద‌కం, ఐబీఎస్ వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి. జీర్ణ‌శ‌క్తిని పెంచుతాయి.
  3. హార్మోన్ల స‌మ‌స్య‌లు: హార్మోన్ల స‌మ‌స్య‌లు, ఆసమతూల్యత ఉన్న‌వారు పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే మంచిది. దీని వ‌ల్ల మ‌హిళ‌ల్లో ఈస్ట్రోజ‌న్‌, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు స‌మ‌తుల్యంలో ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి మెరుగ్గా ప‌నిచేస్తుంది. గ‌ర్భవతుుల పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. వీటిని తినడం వల్ల అనేక పోష‌కాలు ల‌భిస్తాయి.
  4. వాపులు: పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో విట‌మిన్ ఇ, ఫ్లేవ‌నాయిడ్స్, ఇత‌ర వృక్ష సంబంధ స‌మ్మేళ‌నాలు, ఇతర పోషకాలు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి వాపుల‌ను త‌గ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కూడా పొద్దు తిరుగుడు విత్త‌నాల‌తో మేలు జ‌రుగుతుంది.
  5. గుండె ఆరోగ్యం: పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. వీటిల్లో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్లు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాల‌ను త‌గ్గిస్తాయి. త‌ర‌చూ పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
  6. రోగనిరోధక శక్తి: పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను నిత్యం తీసుకోవడం వల్ల హైబీపీ కంట్రోల్ అవుతుంది. అంతేకాక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరగడంతో పాటు చ‌ర్మం, వెంట్రుక‌ల‌కు సంర‌క్ష‌ణ క‌లుగుతుంది. ఎముకలు కూడా దృఢంగా మారుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే