Eating Curd at Night: రాత్రి పూట పెరుగు తింటున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాల్సిందే..

పెరుగు తింటే బరువు పెరుగుతారని చాలా మంది తినడానికి ఇష్టపడరు. నిజానికి పెరుగులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఐతే రాత్రి పూట పెరుగు తినడం వల్ల..

Eating Curd at Night: రాత్రి పూట పెరుగు తింటున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాల్సిందే..
Eating Curd At Night
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 11, 2023 | 10:13 AM

పెరుగు తింటే బరువు పెరుగుతారని చాలా మంది తినడానికి ఇష్టపడరు. నిజానికి పెరుగులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. దీనిని రోజూ పెరుగు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఫలితంగా కడుపులో ఇన్‌ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది. రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్‌ ఈస్ట్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే చాన్స్ చాలా తక్కువని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. పాలు ఇష్టపడని వారికి పెరుగు చక్కని ప్రత్యామ్నాయం. పెరుగు ఒంట్లో వేడిని తక్షణమే తగ్గిస్తుంది. గుండె సమస్యలను చాలా వరకు దరి చేరకుండా నివారిస్తుంది.

దీనిలో అధిక మొత్తంలో కాల్షియం, ఫాస్పరస్ ఉండటంవల్ల దంతాలకు, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే కొందరు నిపుణులు పెరుగుని రాత్రి పూట ఆహారంలో తీసుకోకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త, కఫ దోషాల ఎల్లప్పుడూ సమతుల్యం ఉండాలి. ఐతే పెరుగులోని పులుపు, తీపి లక్షణాలు శరీరంలో కఫ దోషాన్ని పెంచుతుంది. రాత్రిళ్లు అయితే శరీరంలో కఫ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఇది గొంతులో శ్లేష్మ వృద్ధికి దారి తీస్తుంది. అంతేకాకుండా ఆస్తమా, జలుబు, దగ్గుతో బాధపడేవారు మాత్రం రాత్రి పూట పెరుగుకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఐతే పెరుగుకు బదులు మజ్జిగ తీసుకోవచ్చంటున్నారను. అప్పుడప్పుడు పెరుగును పోపు పెట్టి దద్దోజనంలా తిన్నారంటే ఒంట్లో వేడి ఇట్టే మాయమవుతుందట.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆరోగ్య సమాచారం కోసం క్లిక్‌ చేయండి.