Purity Check for Milk: పాలలో కల్తీ జరిగిందో లేదో సులభంగా తెలుసుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి.. ఇట్టే కనిపెట్టేయుచ్చు..
ప్రస్తుత ప్రపంచంలో సహజమైనదీ ఏదీ లేకపోగా, ప్రతీదీ కల్తీమయం అవుతోంది. అంతేకాక ఇలా కల్తీ జరుగుతున్న ఆహార పదార్థాలను మనం గుర్తించలేకపోవడంతో వాటినే తీసుకుంటున్నాము. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు కొని..

Purity Check For Milk
ప్రస్తుత ప్రపంచంలో సహజమైనదీ ఏదీ లేకపోగా, ప్రతీదీ కల్తీమయం అవుతోంది. అంతేకాక ఇలా కల్తీ జరుగుతున్న ఆహార పదార్థాలను మనం గుర్తించలేకపోవడంతో వాటినే తీసుకుంటున్నాము. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. ఈ క్రమంలోనే కల్తీ అవుతున్న పదార్థాల్లో పాలు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి. మరి పాలు కల్తీ జరిగాయో లేదో ఎలా గుర్తించాలి..? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
- కొద్దిగా పాలను తీసుకుని 1 గంట పాటు సన్నని మంటపై మరిగించాలి. దీంతో పాల కోవా తయారవుతుంది. అయితే అది నూనె తరహాలో ఉంటే పాలలో కల్తీ జరగలేదని అర్థం. అలా కాకుండా గట్టిగా ఉంటే మాత్రం ఆ పాలు కల్తీ అయ్యాయని గుర్తించాలి.
- కృత్రిమ పాలను సబ్బులు, సహజసిద్ధమైన పాలను కలిపి తయారు చేస్తారు. అందువల్ల ఆ పాల రుచి తేడా ఉంటుంది. అలాగే వాటిని వేడి చేస్తే ఆ పాలు పసుపు రంగులోకి మారుతాయి.
- పాలలో నీళ్లు కలిపారా లేదా అనే విషయాన్ని కూడా సులభంగానే గుర్తించవచ్చు. ఒక పాల చుక్కను అర చేతిలో వేసి ఆ చుక్క కిందకు ప్రవహించేలా చేయాలి. ఆ చుక్క వెనుక ధారలా ఏర్పడితే ఆ పాలలో నీళ్లు కలిపారని అర్థం. అలా జరగకపోతే ఆ పాలు స్వచ్ఛమైనవిగా భావించాలి.
- పాలలో పిండి కలిపినా గుర్తించవచ్చు. పాలను 5మి.లీ మోతాదులో తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల అయోడైజ్డ్ సాల్ట్‌ను వేయాలి. తరువాత పాలు నీలి రంగులోకి మారితే ఆ పాలు స్వచ్ఛంగా లేవని తెలుసుకోవాలి.
- పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఉత్పత్తి దారులు అందులో ఫార్మాలిన్‌ను కలుపుతారు. అయితే దీంతో పాలను కల్తీ కూడా చేయవచ్చు. దాన్ని ఎలా గుర్తించాలంటే.. 10 ఎంఎల్ పాలను ఒక టెస్ట్ ట్యూబ్‌లో తీసుకుని అందులో 2-3 చుక్కల సల్‌ఫ్యూరిక్ యాసిడ్ వేయాలి. పాలపై బ్లూ రింగ్ కనిపిస్తుంది. అలా కనిపిస్తే పాలు కల్తీ అయ్యాయని అర్థం.
- పాలలో యూరియా కలిపి కూడా వాటిని కల్తీ చేస్తారు. చాలా మంది కల్తీదారులు ఇలాగే చేస్తుంటారు. దీన్ని పసిగట్టాలంటే.. అర టేబుల్ స్పూన్ పాలలో అంతే మోతాదులో సోయాబీన్ పౌడర్‌తో కలిపి బాగా షేక్ చేయాలి. 5 నిమిషాలు ఆగాక ఆ మిశ్రమంలో ఒక లిట్మస్ పేపర్‌ను ముంచి 30 సెకన్ల పాటు ఉంచాలి. దీంతో ఎరుపు రంగులోకి లిట్మస్ పేపర్ రంగు మారుతుంది. నీలి రంగులోకి మారితే పాలు కల్తీ అయినట్లు లెక్క.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..