మేకప్‌ లేకుండా.. మీ చర్మం మెరిసిపోవాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌ మీకోసం..

చాలామంది అందంగా కనిపించేందుకు మేకప్‌ వేసుకుంటుంటారు. మేకప్ వలన చర్మం సహజ కాంతిని కోల్పోతుంది. నిస్తేజంగా మారిన మీ చర్మాన్ని తిరిగి పునరుజ్జీవనం చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన..

మేకప్‌ లేకుండా.. మీ చర్మం మెరిసిపోవాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌ మీకోసం..
Collagen
Follow us
Amarnadh Daneti

|

Updated on: Jan 11, 2023 | 4:57 AM

చాలామంది అందంగా కనిపించేందుకు మేకప్‌ వేసుకుంటుంటారు. మేకప్ వలన చర్మం సహజ కాంతిని కోల్పోతుంది. నిస్తేజంగా మారిన మీ చర్మాన్ని తిరిగి పునరుజ్జీవనం చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కలిగి ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు మెరిసే చర్మం కోసం అనేక ప్రయత్నాలు చేస్తారు. తమ అందానికి మెరుగులు దిద్దడానికి మేకప్ వేసుకుంటారు. కానీ మేకప్ వేసుకోవడం కంటే సహజంగా ముఖ కాంతిని కలిగి ఉండటమే నిజమైన అందం. మేకప్ వల్ల ముఖం ప్లాస్టిక్ పువ్వులా ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ మేకప్ లేకుంటే మీ ముఖమే సహజమైన, అందమైన పుష్పంలా వికసించినట్లు ఉంటుంది. మీ ముఖం విచ్చుకోవాలంటే దానికి తగినంత ఆక్సిజన్, నీరు లభిస్తే చాలు. తీవ్రమైన జీవనశైలి, నిద్రలేమి, పర్యావరణంలోని కాలుష్య కారకాలు, కాలానుగుణ మార్పుల ఫలితంగా మన చర్మం నిర్జీవంగా, నిస్తేజంగా మారుతుంది. కానీ చింతించాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన, ప్రభావవంతమైన ఇంటి చిట్కాలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

హైడ్రేటెడ్‌గా ఉండండి

శరీరంలో ప్రతి అవయవానికి, ప్రతి కణానికి నీరు అవసరం. కాబట్టి తగినంత నీరు తాగడం వలన మొత్తం శరీరానికి వివిధ మార్గాల్లో ప్రయోజనం చేకూరుతుంది, వాటిలో ఒకటి మెరుగైన చర్మం. మీరు హైడ్రేటెడ్ గా ఉంటే మీ ముఖం విచ్చుకుంటుంది. లేదంటే కళావిహీనంగా కనిపిస్తుంది. అందువల్ల నీరు, ఎలక్ట్రోలైట్స్ కలిగిన స్వచ్ఛమైన కొబ్బరినీరు తాగుతుండాలి.

క్లెన్సింగ్

స్పష్టమైన ముఖకాంతిని పొందడం కోసం మీరు తీసుకోగల ముఖ్యమైన రోజువారీ చర్య మీ చర్మాన్ని శుభ్రపరచడం. ప్రతిరోజూ పడుకునే ముందు, ఉదయం నిద్ర లేవగానే, మీ చర్మాన్ని స్వచ్ఛమైన నీటితో పూర్తిగా శుభ్రం చేసుకోండి. బయట తిరగడం, వ్యాయామం, ఆటలతో చర్మంపై దుమ్ము, చెమట, మురికి, సూక్ష్మజీవులు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ చర్మాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యం అప్పుడప్పుడు సహజమైన రోజ్ వాటర్ కూడా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

వేడి నీటిని ఉపయోగించవద్దు

మీ ముఖాన్ని వేడి నీటితో కడగడం వల్ల మీ చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచే సహజ నూనెలు తొలగిపోతాయి. వేడి నీరు మీ చర్మాన్ని పొడిగా చేస్తుంది. మీ చర్మం సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తుంది. మీరు మీ చర్మాన్ని ఎంత బాగా చూసుకుంటారు అనేది మీ ఆరోగ్యం, బిగుతును, ఆకృతిని ప్రభావితం చేస్తుంది.

మేకప్ వద్దు

సహజమైన చర్మ కాంతి పొందాలంటే తరచుగా మేకప్ వేసుకోవద్దు. వారానికి కనీసం ఒకరోజు మీ ముఖానికి ఎలాంటి ఫేషియల్ క్రీమ్‌లు, సౌందర్య సాధనాలను అప్లై చేయకుండా ఉండండి. ఇలా ఏమి చేయకుండా ఉండటం వలన మీ ముఖంలో సహజ నిగారింపు వస్తుంది. అయితే బయటకు వెళ్లేటపుడు హానికరమైన సూర్య కిరణాల ప్రభావాల నుండి మీ చర్మాన్ని రక్షించడం కోసం సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..