AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Potato Recipes: నోరూరించే చైనీస్ పొటాటో ఫ్రై! సాంబార్ అన్నంలోకి ఇది ఉంటే రెండు ముద్దలు ఎక్కువే తింటారు!

పల్లెటూరి వంటలంటేనే నోరూరుతుంది కదా.. అందులోనూ చిన్న చిన్న బంగాళాదుంపలతో చేసే వేపుడు, బజ్జీలు ఉంటే ఆ భోజనమే వేరు. సాధారణ బంగాళాదుంపల కంటే భిన్నంగా ఉండే ఈ చైనీస్ పొటాటోతో చేసే 3 అదిరిపోయే వంటకాలు ఇప్పుడు మీకోసం. బామ్మల కాలం నాటి ఆ రుచులను మీ వంటింట్లోకి ఎలా తీసుకురావాలో ఈ కథనంలో చూడండి!

Baby Potato Recipes: నోరూరించే చైనీస్ పొటాటో ఫ్రై! సాంబార్ అన్నంలోకి ఇది ఉంటే రెండు ముద్దలు ఎక్కువే తింటారు!
Village Style Baby Potato Recipes
Bhavani
|

Updated on: Feb 02, 2026 | 2:46 PM

Share

చల్లని సాయంత్రం వేడి వేడి టీతో పాటు ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తోందా? అయితే బంగాళాదుంపలతో ఎప్పుడూ చేసే కూరలే కాకుండా.. ఇలా వెరైటీగా ఫ్రై, బజ్జీలు, సూప్ ట్రై చేయండి. పోషకాలు మెండుగా ఉండే చిన్న దుంపలతో నోరూరించే విలేజ్ స్టైల్ వంటకాల తయారీ విధానం ఇక్కడ వివరంగా ఉంది. ఓ లుక్కేయండి!

1. బంగాళాదుంప కొబ్బరి వేపుడు

ఇది సాంబార్, రసం లేదా పెరుగు అన్నంలోకి అద్భుతమైన కాంబినేషన్.

తయారీ: చిన్న దుంపలను తొక్క తీసి, ముక్కలుగా కోసి ఉప్పు వేసి 10 నిమిషాలు ఉడికించాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించాలి. అందులో పసుపు, కారం, ఉడికించిన దుంపలు వేసి 5-7 నిమిషాలు వేయించి.. చివరగా తురిమిన కొబ్బరి చల్లి దించేయాలి.

2. చిన్న బంగాళాదుంప బజ్జీలు

టీ టైమ్ స్నాక్స్ గా ఇవి చాలా బాగుంటాయి.

తయారీ: దుంపలను సన్నని చక్రాల్లా కోయాలి. శనగపిండి, బియ్యం పిండి, కారం, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కలిపి పకోడీ పిండిలా చేయాలి. అందులో దుంప ముక్కలను ముంచి, వేడి నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.

3. బంగాళాదుంప సూప్/పులుసు

నిమ్మకాయ సైజు చింతపండు రసంతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది.

తయారీ: బాణలిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, మెంతులు వేయించాలి. అందులో తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు, టమాటా వేసి మెత్తబడే వరకు మగ్గించాలి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు చింతపండు నీరు పోసి.. ముందుగా ఉడికించుకున్న చిన్న దుంపలను కలిపి పులుసు దగ్గర పడే వరకు మరిగించాలి.