సూర్యాపేటలోని 14వ వార్డు కౌన్సిలర్ పదవికి రిటైర్డ్ లెక్చరర్ లింగిడి వెంకటేశ్వర్లు రూ. 1250 నామినేషన్ రుసుమును చిల్లర పైసలతో చెల్లించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో స్వతహాగా స్థాపించిన ప్రజావాణి పార్టీ తరపున ఆయన ఇది 14వ సారి పోటీ పడుతున్నారు.