మధ్యాహ్నం కునుకు మంచిదేనా?.. దీనికి సరైన సమయం ఏదో తెలుసా?

Samatha

2 February 2026

మధ్యాహ్నం నిద్ర పోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. లంచ్ చేసిన తర్వాత ఒక కునుకు తీస్తే బాగుండు అనుకుంటారు. కానీ కొందరికి సమయం దొరకదు.

మధ్యహ్నం కునుకు

ఆఫీసు వర్క్ లేదా ఇతర పనుల వలన కునుకు తీయడం కుదరదు, మరి అసలు మధ్యాహ్నం కునుకు తీయడం మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే?

కునుకు మంచిదేనా?

కునుకు తీయడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు నిపుణులు.

గుండె ఆరోగ్యానికి మంచిది

అంతే కాకుండా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికి, ఒత్తిడి నుంచి బయటపడటానికి, గ్యాస్ట్రిక్ సమస్యలకు  మధ్యాహ్నం కునుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందంట.

అధిక రక్తపోటుకు చెక్

కొంత మంది మధ్యాహ్నం నిద్ర వలన రాత్రి నిద్రపై ప్రభావం పడుతుంది అనుకుంటారు. కానీ మధ్యాహ్నం నిద్ర రాత్రి నిద్రను ప్రోత్సహిస్తుందంట.

నిద్రలేమి

నీరసం, అలసట వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందంట. అయితే  ఎప్పుడు నిద్రపోవాలి అంటే.

నీరసం అలసట

మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత, 3 గంటల తర్వాత నిద్రపోవడం చాలా మంచిదంట. దాదాపు 30 నిమిషాల పాటు కునుకు తీయాలి ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

మధ్యాహ్నం 3

ఇక కొంత మంది సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్యలో నిద్రపోతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు.

సాయంత్రం 4