AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో 'గోల్డ్‌' స్కామ్.. మోసపోయింది ఎవరు అంటే

అమెరికాలో ‘గోల్డ్‌’ స్కామ్.. మోసపోయింది ఎవరు అంటే

Phani CH
|

Updated on: Feb 02, 2026 | 1:10 PM

Share

అమెరికాలోని టెక్సాస్‌లో 460 కోట్ల రూపాయల భారీ గోల్డ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులే లక్ష్యంగా ఈ ముఠా మోసాలకు పాల్పడింది. బ్యాంక్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని, కేసులు ఉన్నాయని బెదిరించి, వారి సేవింగ్స్‌తో బంగారం కొనిపించి, 'ప్రభుత్వ భద్రత' పేరుతో సేకరించారు. ఆ తర్వాత జ్యువెలరీ షాపుల ద్వారా కరిగించి విదేశాలకు తరలించారు. ముగ్గురిని అరెస్టు చేశారు.

అమెరికాలోని టెక్సాస్‌లో గోల్డ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఏకంగా 460 కోట్ల రూపాయలు విలువ చేసే స్కామ్‌ చేశారు కేటుగాళ్లు. ఈ గ్యాంగ్ ప్రధానంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులనే లక్ష్యంగా చేసుకుంది. “మీ బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి”, “మీపై కేసులు ఉన్నాయి” అంటూ ఫోన్ కాల్స్, మెయిల్స్ ద్వారా వారిని భయపెట్టేవారు. తప్పించుకోవాలంటే మొత్తం సేవింగ్స్ తో బంగారం లేదా గోల్డ్ బార్స్ కొనమని ఒత్తిడి చేసేవారు. బంగారాన్ని “గవర్నమెంట్ సేఫ్టీలో ఉంచుతాం” అని నమ్మించి, కొరియర్ మనుషులని పంపి ఇంటి దగ్గరే ఆ బంగారాన్ని కలెక్ట్ చేసుకునేవారు. అలా సేకరించిన బంగారాన్ని జ్యువెలరీ షాపులకు చేరవేసేవారు. షాపు ఓనర్లు ఆ బంగారాన్ని తక్కువ ధరకు కొని.. వెంటనే కరిగించి నగలుగా మార్చి విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ భారీ స్కామ్‌లో బాధితులు దాదాపు 55 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో 460 కోట్ల రూపాయలకు పైగా పోగొట్టుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క కాలిన్ కౌంటీలోనే 200 మందికి పైగా వృద్ధులు మోసపోయారు. ఒక బాధితుడు ఏకంగా 1 మిలియన్ డాలర్ల ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఈ ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా బంగారం, క్యాష్‌ సీజ్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఇర్వింగ్‌లోని ‘తిలక్ జ్యువెలరీ’, ఫ్రిస్కోలోని ‘సైమా జ్యువెలరీ’ షాపులను అడ్డాగా చేసుకుని సాగిన ఈ దందాపై ఏడాది పాటు నిఘా పెట్టిన పోలీసులు.. మెరుపు దాడులు చేసి అసలు గుట్టును రట్టు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారం, వెండి కొనేందుకు ఇదే మంచి సమయమా ??

సాగు రంగానికి నిర్మలమ్మ సాయం ఎంత ??

కేంద్ర బడ్జెట్‌ వేళ.. ఈసారి నిర్మలమ్మ శారీ ప్రత్యేకత ఇదే

కుక్క కోసం రూ. 15 లక్షలు.. ఖర్చు చేసారు.. చివరికి..