సాగు రంగానికి నిర్మలమ్మ సాయం ఎంత ??
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో రైతులకు శుభవార్త అందించారు. సంప్రదాయ వ్యవసాయానికి బదులుగా అధిక విలువైన పంటల సాగుకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంపునకు ప్రాధాన్యమిస్తూ, కొబ్బరి, జీడిపప్పు, గంధం వంటి పంటలకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారు. 500 రిజర్వాయర్లలో చేపల పెంపకం, పశు సంవర్ధకానికి కూడా తోడ్పాటునివ్వనున్నారు.
కేంద్రంలో తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ రైతులకు తీపి కబురు చెప్పారు. సంప్రదాయ వ్యవసాయానికి బదులు విలువైన పంటలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రాధాన్యమిచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అధిక దిగుబడి ఇచ్చే పంటలతో పాటు అధిక విలువైన పంటల దిశగా రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు ప్రత్యేక ప్రోత్సాహక పథకం.. కాయలు కాయని చెట్ల స్థానంలో కొత్త చెట్ల నాటడానికి ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు. జీడిపప్పు, కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు, గంధం చెట్ల వనాలు, బాదం, పైన్‌నట్స్ కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 500 రిజర్వాయర్లలో చేపల పెంపకానికి తోడ్పాటు అందిస్తామన్నారు. పశు సంవర్ధక శాఖలో భారీ ప్రోత్సాహకాలు, అధిక విలువ పంటలకు ప్రోత్సాహం, తీర ప్రాంతాల్లో కొబ్బరి, చందనం చెట్లు నాటడానికి ప్రోత్సాహం ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్రం అడుగున ప్రపంచంలోనే.. అతిపెద్ద జలపాతం
కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవు ??
కింద పడ్డ మామిడికాయలు ఏరుకుంటే.. అంత పెద్ద శిక్షా?
విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు.. ఈజీగా తెలుసుకునేలా.. !
మంటల్లో కావేరి ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని.. టార్గెట్ చేసిన అమెరికా
రెచ్చిపోయిన దొంగలు.. ఒకే ఇంట్లో 120 తులాల బంగారం, కేజీ వెండి చోరీ

