టీ Vs కాఫీ.. దేనిలో కెఫిన్ ఎక్కువ ఉంటుందో తెలుసా?

01 February 2026

TV9 Telugu

TV9 Telugu

టీ, కాఫీల‌ను దాదాపు ఉద‌యం ఇంట్లో తాగేవారుంటారు. ఉద‌యం పూట వీటిని తాగ‌నిదే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. శ‌క్తి, ప్రేగు క‌ద‌లిక‌ల‌కు, శ‌రీర ఉత్తేజానికి టీ లేదా కాఫీల‌ను తాగుతుంటారు

TV9 Telugu

నిజానికి టీ, కాఫీల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు ఉన్నప్ప‌టికీ వీటిలో ఉండే కెఫిన్ మోతాదులో చాలా వ్య‌త్యాసం ఉంటుంది

TV9 Telugu

టీలో కంటే కాఫీలో రెండు రెట్లు ఎక్కువ‌గా కెఫిన్ ఉంటుంది. కెఫిన్ ఎక్కువ‌గా ఉండే కాఫీని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు మ‌రింత శ‌క్తి ల‌భిస్తుంది

TV9 Telugu

శారీర‌క ప‌నితీరు మెరుగుప‌డుతుంది. ఏకాగ్ర‌త పెరుగుతుంది. కెఫిన్ మోతాదును త‌ట్టుకునే వారికి, ఎల్ల‌ప్పుడూ బ‌ల‌మైన మాన‌సిక, శారీర‌క ప్రోత్సాహాన్ని కోరుకునే వారికి కాఫీ మంచి ఎంపిక

TV9 Telugu

అయితే కాఫీని తీసుకోవ‌డం వ‌ల్ల దానిలో ఉండే స‌మ్మేళ‌నాలు ఇరిట‌బుల్ బ‌వెల్ సిండ్రోమ్ ల‌క్ష‌ణాల‌ను ప్రేరేపిస్తాయి. దీంతో జీర్ణ‌క్రియ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి

TV9 Telugu

అందుకే కాఫీ అంద‌రికి సరిపడదు. అయితే టీ చాలా తేలికైన పానియం. ఇందులో కెఫిన్ త‌క్కువ‌గా ఉంటుంది. అలాగే అల్లం, మ‌సాలా వంటి టీల‌ను తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది

TV9 Telugu

రుచి, ప్రాధాన్య‌తను బట్టి చాలా మంది టీ లేదా కాఫీ తాగేందుకు ఇష్టపడతారు. కొంత మంది ఏదైనా ఒకటి తాగితే.. మరికొంత మంది టీ, కాఫీ రెండింటిని తాగుతూ ఉంటారు

TV9 Telugu

అయితే అధిక‌ కెఫిన్ జీర్ణ‌స‌మ‌స్య‌లకు, నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి అని భావించే వారు హెర్బ‌ల్ టీల‌ను తీసుకోవ‌డం మంచిది. ఏది తీసుకున్నా అందులో చ‌క్కెర మోతాదు త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవాలి