AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: ప్రకృతి అద్భుతం.. లడఖ్ మంచు పర్వతాల్లో కుటుంబ సమేతంగా విహరిస్తున్న చిరుతలు..!

లడఖ్ నుండి వచ్చిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. హిమాలయ పర్వతాలలో మంచు చిరుత తన కుటుంబంతో పరుగులు పెడుతూ కనిపించింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) షేర్ చేసిన ఈ అరుదైన 43 సెకన్ల క్లిప్ లక్షలాది మంది జంతు ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది.

Video Viral: ప్రకృతి అద్భుతం.. లడఖ్ మంచు పర్వతాల్లో కుటుంబ సమేతంగా విహరిస్తున్న చిరుతలు..!
Ghosts Of Mountains
Balaraju Goud
|

Updated on: Feb 02, 2026 | 4:30 PM

Share

లడఖ్ నుండి వచ్చిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. హిమాలయ పర్వతాలలో మంచు చిరుత తన కుటుంబంతో పరుగులు పెడుతూ కనిపించింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) షేర్ చేసిన ఈ అరుదైన 43 సెకన్ల క్లిప్ లక్షలాది మంది జంతు ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. మంచు చిరుతలను “పర్వతాల దెయ్యాలు” అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అవి రాళ్ళు, మంచులో పూర్తిగా కలిసిపోతాయి. వాటిని ఇలా చూడటం దాదాపు అసాధ్యం..!

ప్రఖ్యాత IFS అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను సోషల్ మీడియా X లో షేర్ చేశారు. ఒక విషయాన్ని ప్రస్తావించారు. “పర్వతాల దెయ్యాలు.. ఈ ప్రాణాంతకమైన హిమాలయాల మంచుల్లో పరుగెడుతున్నాయో.. ఈ ‘దయ్యాలను’ (చిరుతపులి), మన భారత సైన్యాన్ని చూడవచ్చు” అని రాశారు. మంచులోనూ, మైదానాల్లోనూ జీవించే సామర్థ్యం వీటికి సొంతం. వాటిల్లాగే విధులు నిర్వహిస్తున్న భారత్ సైన్యానికి సాధ్యం. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా, మనుగడ అసాధ్యం అనిపించే ఈ మంచు ఏడారి ప్రాంతాల్లో ఉంటూ భారతదేశాన్ని రక్షించే సైనికులకు నివాళి. అంటూ IFS అధికారి పర్వీన్ కస్వాన్ పేర్కొన్నారు.

మరోవైపు, IAS అధికారిణి సుప్రియా సాహు దీనిని “ప్యూర్ వైల్డ్ జాయ్” అని పేర్కొన్నారు. “ఈ అద్భుతమైన జీవులు మంచు మధ్య కనిపించినప్పుడు, నిర్జీవ పర్వతాలు ప్రాణం పోసుకున్నట్లుగా ఉంటుంది. ఈ దృశ్యం నిజంగా ఆత్మను ఓదార్చుతుంది.” అని రాశారు.

ఈ వీడియో ద్వారా, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రపంచానికి ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపింది. రోడ్డు నిర్మాణం, ప్రకృతి పరిరక్షణ ఒకేసారి సాధ్యమని వివరించారు. “మేము రోడ్లు నిర్మించడానికి ఖచ్చితంగా పర్వతాలను తొలచివేస్తున్నాము, కానీ ఈ మూగ జీవుల ఇళ్లను నాశనం చేయడం ద్వారా కాదు, వాటిని సంరక్షించడం ద్వారా” అని వారు అన్నారు.

ఇదిలావుంటే, ప్రపంచ వన్యప్రాణి నిధి (WWF) ప్రకారం, భారత ప్రభుత్వం హిమాలయాల ఎత్తైన పర్వత ప్రాంతాలలో మంచు చిరుతను ఒక ప్రధాన జాతిగా గుర్తించింది. తాజా నివేదిక (SPAI) ప్రకారం, భారతదేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నాయి. వీటిలో, లడఖ్‌లో మాత్రమే అత్యధిక సంఖ్యలో 477 మంచు చిరుతలు జీవిస్తున్నాయి.

ఇక్కడ మంచు చిరుత కుటుంబానికి చెందిన ఈ అద్భుతమైన వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
రాగి పిండితో గుడ్డు లేకుండా బేక్ చేసే సీక్రెట్ రెసిపీ ఇదే!
రాగి పిండితో గుడ్డు లేకుండా బేక్ చేసే సీక్రెట్ రెసిపీ ఇదే!
వానాకాలంలో రోజూ అల్ల నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
వానాకాలంలో రోజూ అల్ల నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
IPL Trade: పాత గూటికే రిషభ్ పంత్.. ఆ మిస్టరీ స్పిన్నర్‌తో ట్రేడ్
IPL Trade: పాత గూటికే రిషభ్ పంత్.. ఆ మిస్టరీ స్పిన్నర్‌తో ట్రేడ్
ఇల్లు స్వర్గంలా మారాలంటే.. ఈ 7 రహస్యాలు తెలుసుకోండి
ఇల్లు స్వర్గంలా మారాలంటే.. ఈ 7 రహస్యాలు తెలుసుకోండి
ఈ ఐదు తప్పులు చేస్తే.. మనీ ప్లాంట్‌తో మీ సంపద కూడా పోవడం పక్కా..
ఈ ఐదు తప్పులు చేస్తే.. మనీ ప్లాంట్‌తో మీ సంపద కూడా పోవడం పక్కా..
అయోధ్య రామయ్యకు కోటీశ్వరుల మామిడి.. లక్ష విలువైన పండు నైవేద్యం!
అయోధ్య రామయ్యకు కోటీశ్వరుల మామిడి.. లక్ష విలువైన పండు నైవేద్యం!
కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే మటన్ బోన్ సూప్..
కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే మటన్ బోన్ సూప్..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌ తింటే ఏమవుతుందో తెలుసా..? ఇవి తెలిస్తే..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌ తింటే ఏమవుతుందో తెలుసా..? ఇవి తెలిస్తే..
బ్యాంక్ లాకర్‌లో ఉన్న మీ బంగారం పోతే.. నష్టపరిహారం వస్తుందా?
బ్యాంక్ లాకర్‌లో ఉన్న మీ బంగారం పోతే.. నష్టపరిహారం వస్తుందా?
ఇంట్లోని ఈ ప్రదేశాల్లో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి తాండవమే..
ఇంట్లోని ఈ ప్రదేశాల్లో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి తాండవమే..