Health Tips: మీ శరీరంలో కొవ్వును సులభంగా కరిగించే సింపుల్‌ టిప్స్‌.. ఇలా చేస్తే మరెన్నో ప్రయోజనాలు..

మారుతున్న లైఫ్ స్టైల్‌లో ఎన్నో ఆరోగ్య సమస్యలను వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఊబకాయం సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, దిగువ శరీరానికి శ్రమ లేకపోతే తొడలలో కొవ్వు పెరిగిపోతుంది. అయితే కొన్ని రకాల యోగసనాలు..

Health Tips: మీ శరీరంలో కొవ్వును సులభంగా కరిగించే సింపుల్‌ టిప్స్‌.. ఇలా చేస్తే మరెన్నో ప్రయోజనాలు..
Tadasan
Follow us

|

Updated on: Jan 11, 2023 | 6:39 AM

మారుతున్న లైఫ్ స్టైల్‌లో ఎన్నో ఆరోగ్య సమస్యలను వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఊబకాయం సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, దిగువ శరీరానికి శ్రమ లేకపోతే తొడలలో కొవ్వు పెరిగిపోతుంది. అయితే కొన్ని రకాల యోగసనాలు చేయడం ద్వారా శరీరంలో కొవ్వు సులభంగా కరిగిపోతుంది. మారుతున్న జీవనశైలిలో శారీరక శ్రమ తక్కువవుతుంది. మానసిక శ్రమ ఎక్కువవుతుంది. ముఖ్యంగా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. రోజులో ఎక్కువ భాగం కూర్చోవటానికే పరిమితం అవుతున్నారు చాలామంది. దీంతో శరీరాన్ని మోసే దిగువ శరీరానికి పనిలేకపోవడంతో, ఆ భాగమంతా బలహీనపడుతుంది. అలాగే తుంటి, తొడలలో అదనపు శరీర కొవ్వు పేరుకుపోతుంది. తొడలను తిరిగి సరైన ఆకృతిలోకి తీసుకువచ్చేందుకు సరైన వ్యాయామాలు చేయాలి. కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా తుంటి, తొడల కండరాలు మీ శరీర బరువును భరిస్తాయి. కాబట్టి ఈ యోగాసనాలు ఆచరించడం ద్వారా వాటిని బలంగా, సరైన ఆకృతిలోకి తీసుకురావచ్చు.

ఉత్కటాసనం

ఈ ఆసనాన్ని ప్రతిసారీ 30 సెకన్ల విరామంతో 5 సెట్‌ల పాటు వేయాల్సి ఉంటుంది. ఉత్కటాసనం వేసేందుకు సమస్థితితో ప్రారంభించాలి. హృదయ చక్రం వద్ద నమస్కార ముద్రలో ఉండి, మీ చేతులను పైకి లేపాలి. మీ మోకాళ్ళను వంచి, మీ కటిని నెమ్మదిగా తగ్గించాలి. మోకాళ్ల వద్ద 90 డిగ్రీల వంపుతో మీ పెల్విస్ నేలకి సమాంతరంగా ఉందని నిర్ధారించుకోవాలి. మీ దృష్టిని నమస్కారం వైపు కేంద్రీకరించండి. మీ వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.

తడాసనం

దీనినే సమస్థితి అని కూడా అంటారు. రెండు కాళ్లను పాదాలు తగిలేలా దగ్గరకు చేర్చి నిటారుగా నిలబడాలి. ఆపై మీ చేతులను పైకి చాచి ఉంచాలి. మెల్లగా కళ్ళు మూసుకొని, శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచాలి. సాధ్యమైనంత సేపు ఈ భంగిమలో ఉండేందుకు ప్రయత్నించాలి.

ఇవి కూడా చదవండి

ఏక్ పదసానం

ఒంటికాలిపై శరీరాన్ని నిలిపి ఉంచే భంగిమ ఇది. నమస్కార ముద్రతో ప్రారంభించాలి. మీ వీపును నిటారుగా ఉంచి, మీ చేతులను పైకి చాచాలి. ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు మీ వీపు భాగాన్ని ముందుకు వంచాలి. నేలకి సమాంతరంగా ఉండే వరకు వంచాలి. చేతులను మీ చెవుల పక్కన ఉంచాలి. నెమ్మదిగా మీ కుడి కాలును పైకి ఎత్తాలి. దానిని నిటారుగా వెనకకు చాచి ఉంచాలి. నేలపై ఒక చోట మీ చూపులను కేంద్రీకరించాలి. ఇలా ఒకవైపు కాగానే మరోవైపు ఇలానే చేయాలి.

ప్రపదాసనం

మలాసనం లేదా వజ్రాసనంతో ప్రారంభించాలి. పాదాలను ఒకచోట చేర్చి, శరీరాన్ని మీ కాలి మడమల మీద సమతుల్యం చేయాలి. వీపును నిటారుగా ఉంచాలి. అరచేతులను రెండు పక్కలా చాచి, కనుబొమ్మల మధ్య దృష్టి కేంద్రీకరించాలి. ఈ భంగిమలో 10 నుంచి 20 సెకన్ల పాటు శ్వాస తీసుకోవాలి.

వృక్షాసనం

ఒంటికాలిపై శరీరాన్ని నిలిపే భంగిమ ఇది. సమస్థితిలో నిలబడి ప్రారంభించాలి. మీ కుడి కాలును ఎత్తి, మీ ఎడమ లోపలి తొడపై ఉంచాలి. మీ అరచేతులతో పాదానికి మద్దతు ఇవ్వవచ్చు. మీ హృదయ చక్రం వద్ద ప్రాణం ముద్రలో మీ అరచేతులను కలపి, ఆకాశం వైపు ఎత్తండి. మరో కాలుతో అదే పునరావృతం చేయాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..