వేతన జీవులను నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ 2024లో వేతనజీవులు ఆదాయపు పన్ను తగ్గింపు ఆశించారు. అయితే, కొత్త, పాత పన్ను స్లాబుల్లో మార్పులు లేకపోవడంతో నిరాశ ఎదురైంది. ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫైలింగ్ గడువును జులై 31 వరకు, నాన్-ఆడిట్ బిజినెస్‌లు, ట్రస్టులకు ఆగస్టు 31 వరకు పొడిగించారు. ఆదాయపు పన్ను నిబంధనలు సరళీకరించబడ్డాయి, కొత్త చట్టాన్ని అర్థం చేసుకోవడానికి తగిన సమయం లభిస్తుంది.
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుందంటే ముఖ్యంగా వేతనజీవులు ఆదాయపు పన్ను తగ్గుతుందేమో..అని ఆశతో వేచి చూస్తుంటారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన పలు బడ్జెట్‌లలో వేతనజీవులకు భారీ ఊరట కల్పిస్తూ ప్రకటనలు చేసింది. ఈసారి కూడా ఆదాయపు పన్ను తగ్గింపుపై వేతనజీవులు ఆశగా ఎదురు చూశారు. అయితే ఈసారి బడ్జెట్ వేతన జీవులను నిరాశపరిచింది. కొత్త, పాత పన్ను విధానాల్లోని స్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. విధానపరమైన అంశాల్లో మాత్రమే పన్ను చెల్లింపుదారులకు కాస్త ఊరట దక్కింది. ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫైలింగ్‌కు జులై 31 వరకు గడువు కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నాన్-ఆడిట్ బిజినెస్‌లు, ట్రస్టులు ఫైలింగ్‌కు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చారు. ఆదాయపు పన్ను నిబంధనలు సరళతరం చేసినట్లు వెల్లడించారు. కొత్త చట్టాన్ని అర్థం చేసుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు తగినంత సమయం ఇస్తామని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్.. ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే
ఆ రైతు గొప్ప ఆలోచన.. వారికి ఒక కొత్త జీవితాన్నిచ్చింది..
‘కంటైనర్’ వెనక ఇంత కథ ఉందా ??
రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి.. అంతలోనే..
పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం..
రెచ్చిపోయిన ఉప్పల్ బాలు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో స్టంట్స్
జీతం రూ.లక్ష.. సేవింగ్స్ సున్నా.. ముంచుతున్నవి ఈ అలవాట్లే!
సీటుకోసం సమరం.. పాలిటిక్స్‌లో కాదు.. ఆర్టీసీ బస్సులో..
టిఫిన్ సెంటర్లో వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి
మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఇదో వెరైటీ నిరసన!

