Indian Railways: భారతదేశంలోనే తొలి మహిళా రైల్వే స్టేషన్… ఐక్యరాజ్య సమితి ప్రశంసలు.. వీడియో వైరల్‌..

వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యం 27% మాత్రమే ఉన్న భారతదేశం వంటి దేశాల్లో మహిళలు సొంతంగా రైల్వే స్టేషన్‌ను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉండటం మంచి సంకేతం.

Indian Railways: భారతదేశంలోనే తొలి మహిళా రైల్వే స్టేషన్... ఐక్యరాజ్య సమితి ప్రశంసలు.. వీడియో వైరల్‌..
Women Railway Station
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 11, 2023 | 5:20 PM

మహిళా సాధికారత కార్యక్రమాల పట్ల భారతీయ రైల్వేలను ప్రశంసించింది ఐక్యరాజ్యసమితి. ఎందుకంటే భారతీయ రైల్వేలు రాజస్థాన్‌లోని గాంధీ నగర్‌లో దేశంలోనే మొట్టమొదటి మహిళా రైల్వే స్టేషన్‌ను ప్రకటించింది. నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోని జైపూర్ జిల్లాలోని గాంధీ నగర్ రైల్వే స్టేషన్‌కు భారతీయ రైల్వే .. అందరూ మహిళా రైల్వే ఉద్యోగులను నియమించింది. ఈ రైల్వే స్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులచే నిర్వహించబడుతున్న మొదటి స్టేషన్. టిక్కెట్ విక్రయించే వ్యక్తి నుండి టికెట్ కలెక్టర్, స్టేషన్ మాస్టర్, శానిటేషన్ సిబ్బంది, అన్ని ఉద్యోగాలు ఇక్కడ మహిళా ఉద్యోగులే నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి కూడా ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గల గాంధీనగర్‌ రైల్వేస్టేషన్‌ను అందరూ మహిళలే నిర్వహిస్తున్నారు. దేశంలో మహిళలు నిర్వహిస్తున్న తొలి మహిళా రైల్వే స్టేషన్‌ ఇదే. రైల్వే స్టేషన్‌ నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే (ఎన్‌డబ్ల్యూఆర్‌) పరిధిలోని ఈ స్టేషన్‌లో ప్రతీ ఉద్యోగి మహిళే కావడం గమనార్హం.

రాజస్థాన్‌లోని గాంధీ నగర్ రైల్వే స్టేషన్‌లో 40 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఇది ఇతర రైల్వే స్టేషన్ల కంటే మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ రైల్వే స్టేషన్ మీదుగా రోజుకు 50 రైళ్లు ప్రయాణిస్తాయి. ఇందులో 24 రైళ్లు ఆగుతాయి. ప్రతిరోజు దాదాపు 7000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను ఉపయోగిస్తున్నారు. వేగవంతమైన సేవలు, తక్కువ క్యూలు, CCTV కెమెరాలు, మెరుగైన శుభ్రత వంటి అంశాలలో ప్రయాణీకుల అనుభవంలో చాలా మార్పు వచ్చింది. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం మహిళా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించడంతోపాటు రైల్వే స్టేషన్‌లో శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ మిషన్‌ను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మహిళా ఉద్యోగులకు సాధికారత కల్పించే లక్ష్యంతో, రైల్వే స్టేషన్ మొత్తం నిర్వహణలో మహిళా ఉద్యోగులను భాగస్వామ్యం చేసేందుకు భారతీయ రైల్వే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎందుకంటే ఇది సామాజిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మంచి ఉదాహరణగా ఉంటుంది. వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యం 27% మాత్రమే ఉన్న భారతదేశం వంటి దేశాల్లో మహిళలు సొంతంగా రైల్వే స్టేషన్‌ను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉండటం మంచి సంకేతం.

ముంబై జోన్‌లోని మాతుంగా రైల్వే స్టేషన్‌లో మొత్తం మహిళా సిబ్బంది ఉన్నారు. ఇది సబ్-అర్బన్ విభాగంలో ఉంది. కానీ గాంధీ నగర్ రైల్వే స్టేషన్ మెయిన్ లైన్ సెక్షన్‌లో దేశంలోనే మొదటిది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!