Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoist Hidma: తెలంగాణ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం..

తెలంగాణ గ్రేహౌండ్స్‌ ఆపరేషన్లో మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు.

Maoist Hidma: తెలంగాణ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం..
Maoist Madvi Hidma
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 11, 2023 | 5:34 PM

అతడో వ్యూహకర్త. ఎరవేసి దాడులు చేయడంలో సిద్ధహస్తుడు.. అతడి ప్రణాళికలు ప్రత్యర్థులకు ప్రహేళికలు.. చదివింది అయిదో తరగతి.. హిందీ, ఇంగ్లీషు భాషల్లో దిట్ట! .. అతడి వ్యూహంలో చిక్కుకుంటే సాలెగూట్లో చిక్కుకున్నట్టే! ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. ఆ చావు కూడా భయంకరంగానే ఉంటుంది. అతడికి చిక్కితే అనాయాస, సునాయస మరణాలు ఉండవు. అతడి నిఘంటువులో జాలి, దయ, కరుణ అన్న పదాలు ఉండవు. ఇప్పుడతడు దేశవ్యాప్త సంచలనం. అతడు మడవి హిడ్మా. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంలో ఇతడే కీలక సూత్రధారి. అతడే.. హిడ్మా.. అలాంటి మోస్ట్ వాంటెడ్‌ మావోయిస్టు, మావో కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. బీజాపూర్‌-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా చనిపోయాడు. తెలంగాణ గ్రేహౌండ్స్. CRPF కోబ్రా జాయింట్ ఆపరేషన్‌లో హిడ్మా మృతి చెందినట్టు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మా మృతితో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలినట్టు భావిస్తున్నారు. బీజాపూర్‌-తెలంగాణ సరిహద్దుల్లో బుధవారం ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిందని.. ఈ జాయింట్ ఆపరేషన్‌లో మాడ్వి హిడ్మా హతమైనట్లు పేర్కొంటున్నారు.

మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ ఒకటో బెటాలియన్‌ కమాండర్‌గా ఉన్న హిడ్మాపై 45 లక్షల రివార్డు ఉంది. ఆదివాసీల్లో హిడ్మాకు చాలా పట్టు ఉంది. హిడ్మా కోసం గతంలో కూడా పలు ఆపరేషన్లు చేపట్టారు. కాని ఈసారి మాత్రం సీఆర్‌పీఎఫ్‌ , కేంద్ర బలగాలకు సక్సెస్‌ లభించినట్టు తెలుస్తోంది.

హిడ్మా ఎవరంటే..

మాడ్వి హిడ్మా.. ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు కీలక వ్యూహకర్తగా ఉన్నాడు. 1996-97లలో 17 ఏళ్ల వయసులో హిడ్మా మావోయిస్టుల్లో చేరాడు. సంతోష్, హిద్మల్లు .. హిడ్మాకు మారు పేర్లు.. దక్షిణ బస్తర్ జిల్లా సుక్మా జిల్లాలోని పువర్తి హిడ్మా స్వగ్రామం.. మావోయిస్టు పార్టీలోకి రాక ముందు హిడ్మా వ్యవసాయం చేసేవాడు.

హిడ్మా చదివింది 7వ తరగతే.. అయినా పార్టీతో కలిసి పని చేసే ఓ లెక్చరర్ ద్వారా ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపైర్ వర్క్‌లో నిపుణుడు. 2001-02 ప్రాంతాల్లో దక్షిణ బస్తర్ జిల్లా ప్లటూన్‌లో హిడ్మా ఎదిగాడు. సాల్వాజుడుం ఎదుగదలే హిడ్మా మరింత యాక్టివ్‌ కావడానికి కారణమైంది. 2007లో ఉర్పల్ మెట్ట వద్ద సీఆర్పీఎఫ్‌పై జరిగిన దాడిలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. 2008-09లో మావోయిస్టు ఫస్ట్ బెటాలియన్‌కి కమాండర్‌గా ఎంపికైన హిడ్మా.. 2011లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటిలో సభ్యునిగా నియామకమయ్యాడు. ఆ తర్వాత కేంద్ర కమిటీలో కీలక నేతగా మారాడు. తుపాకీ పట్టేది తక్కువైనప్పటకిీ.. యుద్ధభూమిలో పక్కనే ఉండి మిగిలిన మావోయిస్టులను నడిపించడం ఆయన ప్రత్యేకత..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

సిగ్గుపడుతూ.. తన ప్రేమను వ్యక్తపరుస్తున్న జబర్దస్త్ బ్యూటీ రష్మీ
సిగ్గుపడుతూ.. తన ప్రేమను వ్యక్తపరుస్తున్న జబర్దస్త్ బ్యూటీ రష్మీ
లా సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
లా సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈటాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఎన్‌సీసీ డ్రెస్‌లో ఉన్న ఈటాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
యశ్ టాక్సిక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన
యశ్ టాక్సిక్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన
ఇంటర్ ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశాలకు RJC CET 2025 నోటిఫికేషన్ జారీ
ఇంటర్ ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశాలకు RJC CET 2025 నోటిఫికేషన్ జారీ
ఫస్ట్‌ మ్యాచ్‌లోనే 300 గ్యారెంటీనా?
ఫస్ట్‌ మ్యాచ్‌లోనే 300 గ్యారెంటీనా?
భయ్యా.. ఎక్కడ? సన్నీయాదవ్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ
భయ్యా.. ఎక్కడ? సన్నీయాదవ్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ
ఆర్సీబీ గెలిచింది సాల్ట్‌, కోహ్లీ వల్ల కాదు..!
ఆర్సీబీ గెలిచింది సాల్ట్‌, కోహ్లీ వల్ల కాదు..!
ఆ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌తో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డేటింగ్!
ఆ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌తో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల డేటింగ్!
APPSC గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్ధులకు మరో ఛాన్స్.. మిస్‌ చేసుకోకండి
APPSC గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్ధులకు మరో ఛాన్స్.. మిస్‌ చేసుకోకండి