Budget 2023: వార్షిక బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజల ఆశలు నెరవేరుతాయా? రూ. 5 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందా?
ముఖ్యంగా 2014 నుంచి యూనియన్ బడ్జెట్ లో పన్ను స్లాబ్‌లు, పన్ను రేట్లు లేదా స్టాండర్డ్ డిడక్షన్‌లలో మార్పుల ద్వారా ఎలాంటి ఉపశమనం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. కోవిడ్-19 సంక్షోభం వేతన జీవుల పొదుపులను మొత్తం మింగేసింది. దీంతో ప్రస్తుతం వేతనాల్లో కోతలు వారిని మరీ ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే ఈఎంఐ ల భారం పెరగడం, ఈపీఎఫ్ ఓ వడ్డీ తగ్గింపు నేపథ్యంలో పొదుపు చేసే అవకాశం తగ్గిపోయింది. కాబట్టి వార్షిక డిడక్షన్ ను పెంచాలని కోరుతున్నారు.

ఫిబ్రవరి 1 న కేంద్రం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. ఈ నేపథ్యంలో మధ్య తరగతి ప్రజలు బడ్జెట్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారుల్లో అధికంగా ఉండే మధ్యతరగతి ప్రజలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికైనా మినాహాయింపును ఇవ్వకపోతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 2014 నుంచి యూనియన్ బడ్జెట్ లో పన్ను స్లాబ్‌లు, పన్ను రేట్లు లేదా స్టాండర్డ్ డిడక్షన్‌లలో మార్పుల ద్వారా ఎలాంటి ఉపశమనం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. కోవిడ్-19 సంక్షోభం వేతన జీవుల పొదుపులను మొత్తం మింగేసింది. దీంతో ప్రస్తుతం వేతనాల్లో కోతలు వారిని మరీ ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే ఈఎంఐ ల భారం పెరగడం, ఈపీఎఫ్ ఓ వడ్డీ తగ్గింపు నేపథ్యంలో పొదుపు చేసే అవకాశం తగ్గిపోయింది. కాబట్టి వార్షిక డిడక్షన్ ను పెంచాలని కోరుతున్నారు.
ప్రస్తుతం బడ్జెట్ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలో సంప్రదింపులు జరుగుతున్నాయి. కాబట్టి కేంద్ర బడ్జెట్ 2023 లో ఆదాయపు పన్ను పరిమితి, స్టాండర్డ్ డిడక్షన్ పెంచవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల శ్లాబ్ ను రూ. 5 లక్షల వరకూ పెంచవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఆదాయపు పన్ను పరిమితి పెరిగినా కేవలం కొంత మందికి మాత్రమే ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పరిమితి కేవలం కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని కేంద్రం మెలికపెట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పన్ను విధానం 2020 లో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకూ కేవలం 10-12 శాతం మంది పన్ను చెల్లింపుదారులు మాత్రమే కొత్త విధానాన్ని అవలంభిస్తున్నారు. కాబట్టి కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి మాత్రమే రూ.5 లక్షల పరిమితి పొందే అవకాశం ఉంటుందని కేంద్రం తెలిపే అవకాశం ఉంది.
అలాగే కార్పొరేట్ పన్ను విషయంలో కేంద్రం ఉదాసీనంగా ఉండనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో స్థిరమైన వృద్ధి సాధించాలంటే పెట్టుబడులు చాలా అవసరం. ఈ నేపథ్యంలో కార్పొరేట్స్ వేసే పన్ను విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో విధించే కార్పొరేట్ పన్ను చాలా ఎక్కువ. దాదాపు సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో కంటే 42 శాతం పన్ను ఇక్కడ అధికంగా ఉంటుంది. కాబట్టి దేశం నుంచి పెట్టుబడులు చేజారకుండా ఉండేందుకు కార్పొరేట్ పన్నుపై కేంద్రం పునరాలోచించుకోవచ్చని మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం