Budget 2022: మిడిల్ క్లాస్‌‌‌పై ఆర్థిక మంత్రి వరాల జల్లు.. బడ్జెట్‌లో వీటికి ఉపశమనం లభించనుందా?

సెక్షన్ 80సీ పరిమితి చాలా ఏళ్లుగా మారలేదు. ప్రస్తుతం ఈ సెక్షన్ కింద మినహాయింపు పరిమితి రూ.1.5 లక్షలుగా ఉంది. పొదుపు రేటులో నిరంతర పతనం దృష్ట్యా, దీనిని పెంచవచ్చని తెలుస్తోంది.

Budget 2022: మిడిల్ క్లాస్‌‌‌పై ఆర్థిక మంత్రి వరాల జల్లు.. బడ్జెట్‌లో వీటికి ఉపశమనం లభించనుందా?
Budget 2022
Follow us
Venkata Chari

|

Updated on: Jan 30, 2022 | 12:35 PM

Budget 2022: ఫిబ్రవరి 1, 2022న దేశ బడ్జెట్ (Budget 2022) ప్రవేశపెట్టనున్నారు. తీవ్ర ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న దేశంలోని దిగువ, మధ్యతరగతి వర్గాలు ఈ బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీంతో పాటు ప్రభుత్వం నుంచి తమకు కొంత సాయం అందుతుందని ఉన్నత వర్గాలు కూడా బడ్జెట్‌లో చాలా ఆశలు పెట్టుకున్నాయి. అందుకే, ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న 2022-23 బడ్జెట్‌పై యావత్ దేశం దృష్టి సారించింది. మీడియా నివేదికల ప్రకారం, ఈ ద్రవ్యోల్బణం నుంచి దేశంలోని సాధారణ ప్రజలకు ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగించనుందని తెలుస్తోంది. తద్వారా వారి జీవితం సాఫీగా ముందుకు సాగుతుందని అంటున్నారు. దీంతో ఇకపై ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం , ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం 5 రంగాలలో సాధారణ ప్రజలకు ఉపశమనం ఉంటుందని భావిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

1. ప్రాథమిక మినహాయింపు పరిమితి: ప్రభుత్వం చివరిసారిగా 2014-15 బడ్జెట్‌లో ప్రాథమిక మినహాయింపు పరిమితిని సవరించింది. ఇందులో అన్ని తరగతుల పన్ను చెల్లింపుదారులకు రూ.2.5 లక్షల వరకు రాయితీ లభించింది. దీంతోపాటు 60-80 ఏళ్ల వృద్ధులకు రూ.3 లక్షలు, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు. ఈ పరిమితిని పెంచితే దేశంలోని సామాన్యులకు ఊరట లభించడమే కాకుండా ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు భారం కూడా తగ్గుతుంది.

2. పన్ను స్లాబ్‌ల సవరణ: ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే సర్దుబాటు కోసం అత్యధిక ఆదాయ రేటు రూ. 10 లక్షల కంటే తక్కువ ఉన్న వారి కోసం ప్రత్యేకంగా స్లాబ్‌లో కొన్ని సవరణలు చేయనున్నారు.

3. ఆర్థిక పొదుపు కోసం ప్రోత్సాహకాలు: సెక్షన్ 80C పరిమితి చాలా సంవత్సరాలుగా మార్చలేదు. ట్యూషన్ ఫీజు, హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ చెల్లింపు వంటి పొదుపు కాని వస్తువులను కూడా ఇందులో కవర్ చేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సెక్షన్ కింద మినహాయింపు పరిమితి రూ.1.5 లక్షలు. పొదుపు రేటులో నిరంతర పతనం దృష్ట్యా, దానిని పెంచే అవకాశాలు ఉన్నాయి.

4. గృహ రుణంపై వడ్డీ మాఫీ: గృహ రుణ వడ్డీ రేట్లు గత కొన్ని సంవత్సరాలుగా సవరించలేదు. అయితే సగటు గృహాల ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం వడ్డీ చెల్లింపులపై రూ.2 లక్షలు మాఫీ అవుతుంది. అసలు రీపేమెంట్ రూ. 1.5 లక్షలు (80సీ పరిమితి రూ. 1.5 లక్షలతో కలిపి). వడ్డీ మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని పరిశ్రమ కోరుతోంది.

5. స్టాండర్డ్ డిడక్షన్: స్టాండర్డ్ డిడక్షన్ FY19లో తిరిగి ప్రవేశపెట్టారు. రవాణా భత్యం, వైద్యానికి సంబంధించిన రీయింబర్స్‌మెంట్స్‌ కూడా ఉన్నాయి. ఇది FY19 రూ 40,000గాను, FY20 (మధ్యంతర) రూ 50,000గాను ఉంది. ఇంటి నుంచి పని చేయడం వల్ల పెరిగిన ఖర్చు కాకుండా, రవాణా, ఔషధాల ధరలను దృష్టిలో ఉంచుకుని దీనిని పెంచవచ్చని తెలుస్తోంది. దీనితో పాటు, ఆరోగ్య బీమా కోసం సెక్షన్ 80డిలో మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దీని పరిమితి రూ.25,000గా ఉంది. కోవిడ్ దృష్ట్యా, హెల్త్ పాలసీ ప్రీమియంలో 18 శాతం GST విధిస్తున్నారు. దీనిని 5 శాతానికి పెంచవచ్చు.

Also Read: Budget 2022: ఈ బడ్జెట్‌లో నిరుద్యోగుల కలలు ఫలించనున్నాయా.. నిర్మలమ్మ తీపి కబురు చెబుతారా?

Budget 2022: ఇన్వెస్టర్స్ ఆశల్ని రాబోయే బడ్జెట్ తీరుస్తుందా?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..
వాసుకి కాల సర్ప దోషమా.. తలెత్తే ఇబ్బందులు? దోష నివారణలు ఏమిటంటే
వాసుకి కాల సర్ప దోషమా.. తలెత్తే ఇబ్బందులు? దోష నివారణలు ఏమిటంటే