AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ ఉన్నవారు మామిడిపండు తింటే ఏమవుతుంది..? ఈ కొత్త స్టడీ రిపోర్ట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని పిలుచుకునే మామిడిని ఒక్క ముక్క తిన్నా ఎక్కడ చక్కెర స్థాయిలు ఆకాశాన్ని తాకుతాయో అని షుగర్ పేషెంట్లు దానిని దూరం పెడుతుంటారు. కానీ ఇప్పుడు ఆ భయాలకు కాలం చెల్లింది. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను ఆస్వాదించడమే కాదు అవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని అంతర్జాతీయ పరిశోధనలే వెల్లడిస్తున్నాయి.

షుగర్ ఉన్నవారు మామిడిపండు తింటే ఏమవుతుంది..? ఈ కొత్త స్టడీ రిపోర్ట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Can Diabetics Eat Mangoes
Krishna S
|

Updated on: Feb 25, 2026 | 8:57 PM

Share

మామిడి సీజన్ వచ్చిందంటే చాలు.. ఆ మధుర ఫలాలను చూసి నోరు ఊరని వారుండరు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం అబ్బే మామిడి తింటే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి అనే భయంతో ఆ అమృతాన్ని దూరం పెడుతుంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇప్పుడు ఒక తీపి కబురు అందింది. మామిడి పండ్లు తినడం వల్ల షుగర్ పెరగడం పక్కన పెడితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు సరైన పద్ధతిలో మామిడి తింటే అది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది.

ఏమిటా పరిశోధన?

సుమారు ఎనిమిది వారాల పాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో పరిశోధకులు కొన్ని ఆసక్తికరమైన అంశాలను గుర్తించారు. రోజువారీ అల్పాహారంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారానికి బదులుగా మామిడిని తీసుకున్న వారిలో చక్కెర స్థాయిలు పెరగకపోగా, నియంత్రణలో ఉన్నట్లు గమనించారు. మామిడి తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడిందని తేలింది. సరైన పరిమాణంలో తీసుకున్నప్పుడు ఇది బరువు పెరగకుండా చేయడంలో కూడా సహాయపడింది.

ఎలా తింటే సురక్షితం?

మామిడి పండు తింటే షుగర్ పెరుగుతుందా లేదా అనేది మీరు ఎంత తింటున్నారు, ఎలా తింటున్నారు..? అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

  • రోజుకు 250 గ్రాముల కంటే ఎక్కువ మామిడి పండును తీసుకోకూడదు.
  • మామిడి తిన్న రోజున, మీరు తీసుకునే ఇతర కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ ఉన్న ఆహారాన్ని తగ్గించాలి.
  • బిర్యానీలు లేదా స్వీట్లు తిన్న తర్వాత మామిడి పండు తింటే మాత్రం షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది.

మామిడిలో దాగున్న పోషక విలువలు

మామిడి కేవలం రుచికి మాత్రమే కాదు, ఇది పోషకాల గని కూడా..

విటమిన్లు: విటమిన్ A, C, B6 పుష్కలంగా ఉంటాయి.

ఖనిజాలు: పొటాషియం, ఐరన్ లభిస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు: శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీఆక్సిడెంట్లు ఇందులో మెండుగా ఉన్నాయి.

Follow Us