ఫరీదాబాద్‌లో జరిగిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పది అంతస్తుల అపార్ట్మెంట్లోని తన చీరను తిరిగి తెచ్చుకోవడానికి ఓ తల్లి తన కుమారుడి ప్రాణాలను పణంగా పెట్టింది. బాలుడిని క్లాత్‌తో వేలాడదీసి కిందపడిన చీరను తీయించింది. ఈ వీడియో వైరల్‌గా మారగా, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాపాయం ఉండేదని పలువురు ఆందోళన చెందుతున్నారు.