AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భోజనం చేస్తూ ఫోన్ చూస్తున్నారా..? ఆ రోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం పక్కా..

పూర్వం మన పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేవారు. భోజనం చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలని, ఆహారాన్ని ఆస్వాదించాలని అనేవారు. కానీ నేటి బిజీ లైఫ్, సోషల్ మీడియా పిచ్చిలో.. ప్లేటు ముందు ఉన్నా, మన దృష్టి మాత్రం మొబైల్ ఫోన్ స్క్రీన్ పైనే ఉంటోంది. రీల్స్ స్క్రోల్ చేస్తూనో, టీవీ చూస్తూనో తినడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారింది. అయితే ఈ అలవాటు మీ శరీరానికి ఎంతటి హాని చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..

Krishna S
|

Updated on: Feb 25, 2026 | 7:52 PM

Share
పెరిగే ఊబకాయం: మనం భోజనం చేస్తూ ఫోన్ చూస్తున్నప్పుడు మన మెదడు ఆహారంపై దృష్టి పెట్టదు. దీనివల్ల పొట్ట నిండిందనే సంకేతం మెదడుకు ఆలస్యంగా అందుతుంది. ఫలితంగా మనం తెలియకుండానే అవసరానికి మించి ఎక్కువగా తినేస్తాం. ఇదే మెల్లగా ఊబకాయానికి దారితీస్తుంది.

1 / 5
జీర్ణవ్యవస్థ చిన్నాభిన్నం: ఆహారాన్ని సరిగ్గా నమలడం అనేది జీర్ణక్రియలో మొదటి మెట్టు. ఫోన్ చూస్తూ తినేవారు ఆహారాన్ని సరిగ్గా నమలరు. ముక్కలు ముక్కలుగా మింగేయడం వల్ల అది జీర్ణం కాక మలబద్ధకం , కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తుంది.

2 / 5
స్క్రీన్ చూస్తూ తినడం వల్ల మన జీవక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగ్గా ప్రాసెస్ అవ్వకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో అసాధారణ మార్పులు వస్తాయి. ఇది దీర్ఘకాలంలో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

3 / 5
 భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్లను, టీవీ రిమోట్లను కనీసం 10 అడుగుల దూరంలో ఉంచండి. ఆహారం రుచి, వాసన, రంగును గమనిస్తూ తినండి. దీనివల్ల ఎంజైమ్‌లు బాగా విడుదలై జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

4 / 5
ప్రతి ముద్దను కనీసం 32 సార్లు నమలాలని ఆయుర్వేదం చెబుతోంది. ఆహారం నోట్లోనే ద్రవంగా మారినప్పుడు కడుపులో భారం తగ్గుతుంది. భోజనానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన అరగంట తర్వాత మాత్రమే నీరు తాగాలి. తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణ అగ్ని చల్లారిపోతుంది.

5 / 5
Follow Us