AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: మరో సంచలనానికి రామ్‌గోపాల్ వర్మ సిద్ధం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా

ముంబై మాఫియా కథల ఆధారంగా గతంలో 'సత్య', 'కంపెనీ' వంటి కల్ట్ చిత్రాలను తెరకెక్కించారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఆయన మరో సంచలనానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ జీవిత కథ ఆధారంగా ఆర్జీవీ ఓ బయోపిక్ ను తెరకెక్కించనున్నట్లు టాక్.

Ram Gopal Varma: మరో సంచలనానికి రామ్‌గోపాల్ వర్మ సిద్ధం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
Ram Gopal Varma
Basha Shek
|

Updated on: Jun 19, 2026 | 8:50 AM

Share

ఒకప్పుడు విలక్షణమైన, వాస్తవిక క్రైమ్ చిత్రాలతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ పెను సంచలనాలు సృష్టించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ముంబై అండర్‌వరల్డ్ మాఫియా ఆధారంగా ఆర్జీవీ తెరకెక్కించిన సత్య, కంపెనీ, సర్కార్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఆయన మరో సంచలననానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ముంబై అండర్‌వరల్డ్ చరిత్రలోని మరో ఉత్కంఠభరితమైన అధ్యాయాన్ని తెరపైకి తీసుకురావడానికి ఆర్జీవీ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ముంబైకి చెందిన ప్రముఖ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ జీవితం ఆధారంగా ఒక బయోపిక్‌ను రూపొందించేందుకు ఆర్జీవీ చర్చలు జరుపుతున్నారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బయోపిక్ ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని, స్క్రిప్ట్ సిద్ధం అవుతోందని సమాచారం. ముంబై పోలీసు చరిత్రలో దయా నాయక్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన సుమారు 84 కౌంటర్లలో పాల్గొన్నాడని పేరున్న క్రిమినల్స్, రౌడీ షీటర్లను లేపేశాడని ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగానే ఆర్జీవీ బయోపిక్ రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని కేవలం బయోపిక్‌గా తీయాలా లేక ఆర్జీవీ సొంత సూపర్ హిట్ ‘కంపెనీ’కి సీక్వెల్‌గా తీయాలా అని నిర్మాతలు చర్చిస్తున్నారట.

ఇవి కూడా చదవండి

2010లోనే ‘కంపెనీ 2’ తీయాలనే ఆలోచన ఆర్జీవీకి వచ్చింది. గ్యాంగ్‌స్టర్ల కథకు బదులుగా ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుల కథపై ఎక్కువగా దృష్టి పెట్టాలని ఆయన ప్రణాళిక వేసుకున్నారు. అందువల్ల, రాబోయే దయా నాయక్ బయోపిక్‌కు స్వయంగా దయా నాయక్‌నే సలహాదారుడిగా నియమించాలని చిత్ర బృందం ఇప్పుడు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘సిండికేట్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘ధురందర్’ సినిమా తరహాలో ఉగ్రవాదం, ఒక క్రైమ్ నెట్ వర్క్ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. ‘సిండికేట్’ షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన ‘సర్కార్ 4’ ను స్టార్ట్ చేసే యోచనలో ఆర్జీవీ ఉన్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us