AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parivartan Yoga: అరుదైన పరివర్తన యోగం.. ఆ రాశుల వారికి లక్ష్మీకటాక్షం

జూన్ 24 నుంచి 26 వరకు శుక్రుడు, చంద్రుడి మధ్య ఏర్పడనున్న అరుదైన పరివర్తన యోగం ఆరు రాశుల వారికి విశేష శుభఫలితాలను అందించనుంది. ఈ ప్రభావంతో ఆదాయం పెరగడం, కెరీర్‌లో పురోగతి, ప్రేమ వ్యవహారాల్లో విజయం, వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు, మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరే అవకాశాలు మెరుగవుతాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 18, 2026 | 6:41 PM

Share
ఈ నెల(జూన్) 24, 25, 26 తేదీల్లో శుక్ర, చంద్రుల మధ్య విశిష్టమైన పరివర్తన చోటు చేసుకుంటోంది. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో శుక్రుడు, శుక్రుడికి చెందిన తులా రాశిలో చంద్రుడు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన ఏర్పడింది. భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడు మనస్సుకు కారకుడైన చంద్రుడితో పరివర్తన చెందడం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారి జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు తీరుతాయి. ఆదాయం వృద్ధి చెందడం, కెరీర్ పరంగా అనుకూలతలు పెరగడం, ప్రేమల్లో విజయాలు సాధించడం, వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవడం వంటివి జరుగుతాయి.

1 / 7
మేషం: ఈ రాశికి చతుర్థ, సప్తమ స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల కుటుంబ జీవితం, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది.

2 / 7
మిథునం: ఈ రాశికి ధన, పంచమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల అనేక వైపుల నుంచి అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. ఉద్యోగులకు, వ్యాపారాలకు దశ తిరుగుతుంది. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది. ఉద్యోగంలో గుర్తింపు లభించి పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ప్రేమ, పెళ్లి విషయాల్లో విజయాలు సాధిస్తారు. లాటరీ వచ్చే అవకాశం కూడా ఉంది.

3 / 7
కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడికి, చతుర్ధాధిపతి శుక్రుడికి మధ్య పరివర్తన జరగడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. మనసులోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల లాభాల పంట పండుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది.

4 / 7
కన్య: ఈ రాశికి ధన, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారమవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది.

5 / 7
తుల: రాశ్యధిపతి శుక్రుడికి, దశమాధిపతి చంద్రుడికి పరివర్తన జరగడం వల్ల ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలకు దశ తిరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సినిమా, టీవీ కళాకారులకు ఉచ్ఛ దశ ప్రారంభమవుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం జరుగుతుంది.

6 / 7
మకరం: ఈ రాశికి సప్తమ, దశమాధిపతుల మధ్య పరివర్తన వల్ల ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆర్థికంగా ఊహించని అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి.

7 / 7
Follow Us