AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రజలకు బిగ్‌ అలర్ట్.. వరుసగా 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్‌లు బంద్.. ఎప్పుడెప్పుడంటే?

తెలంగాణలోని భూములు అమ్మే, లేదా కొనుగోలు చేసేవారికి బిగ్‌ అలర్ట్. రాష్ట్రంలో మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్‌ సేవలు ఆగిపోనున్నాయి. సర్వర్ అప్‌‌‌‌గ్రేడేషన్, సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా ఈనెల 26 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్‌శాఖతో పాటు అనుబంధ ఆన్‌లైన్‌ సేవలు ఆగిపోనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.

Telangana: ప్రజలకు బిగ్‌ అలర్ట్.. వరుసగా 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్‌లు బంద్.. ఎప్పుడెప్పుడంటే?
Telangana Property Registration Alert
Anand T
|

Updated on: Jun 19, 2026 | 8:11 AM

Share

రాష్ట్రంలోని భూ విక్రయ, కొనుగోలు దారులకు తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 26 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్‌శాఖతో పాటు అనుబంధ ఆన్‌లైన్‌ సేవలు నిలిచి పోనున్నాయని పేర్కొంది. నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ తెలిపారు రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇంటి, భూమి, ఇతర ఎలాంటి ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదని స్పష్టం చేశారు.

గడిచిన ఐదేళ్లుగా సర్వర్లను అప్‌డేట్ చేయలేదని.. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్నింటిని పూర్తిస్థాయిలో అప్‌‌‌‌గ్రేడ్ చేయనున్నట్టు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ హననుమంతు తెలిపారు. ఈ అప్‌డేట్ తర్వాత సేవలు మరింత వేగంగా పనిచేస్తాయిని.. సెక్యూరిటీ పరంగా కూడా చాలా వరకు మెరుగుపడతాయని ఆయన తెలిపారు. అయితే ఎవరికైనా ఎమర్జెన్సీగా రిజిస్టేషన్‌లు చేసుకోవాల్సి ఉంటే వారు అందుకు సంబంధించిన పనులు ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు.

జూన్ 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. అప్పటి వరకు అధికారులకు సహకరించాలని ప్రజలకు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us