AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIP: రూ.కోటి సంపాదించడమే మీ కల అయితే ఇంతకు మించిన మార్గం లేదు!

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) అనేది చిన్న నెలవారీ పెట్టుబడులతో దీర్ఘకాలంలో పెద్ద సంపదను సృష్టించడానికి ఆర్థిక నిపుణులు సూచించే ఉత్తమ మార్గం. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే, కంపౌండింగ్ శక్తితో గణనీయమైన నిధిని పొందవచ్చు.

SIP: రూ.కోటి సంపాదించడమే మీ కల అయితే ఇంతకు మించిన మార్గం లేదు!
Inflation Sip
SN Pasha
|

Updated on: Feb 25, 2026 | 8:38 PM

Share

ప్రతి నెలా చిన్న మొత్తంతో పెద్ద నిధిని నిర్మించాలనుకునే వారికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఉత్తమ మార్గంగా ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ SIP ద్వారా క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో గణనీయమైన సంపద సృష్టించుకోవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. SIPలో పెట్టుబడి విధానం చాలా సులభం. పెట్టుబడిదారు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాలి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రాబడులు మారుతూ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో సగటున 12 శాతం వరకు రాబడి పొందే అవకాశముందని నిపుణుల అంచనా. ముఖ్యంగా సమయం ఎక్కువగా ఉంటే కంపౌండింగ్ ప్రభావం వల్ల చిన్న పెట్టుబడులు కూడా భారీ నిధిగా మారే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు ఒక పెట్టుబడిదారు నెలకు రూ.4,000 చొప్పున SIP చేస్తూ 30 సంవత్సరాలు కొనసాగిస్తే మొత్తం పెట్టుబడి రూ.14.40 లక్షలు అవుతుంది. సగటు 12 శాతం రాబడి వస్తుందని భావిస్తే, కాలపరిమితి ముగిసే సరికి సుమారు రూ.1.23 కోట్ల నిధి సమకూరుతుంది. ఇందులో పెట్టిన మూలధనం కంటే దాదాపు రూ.1.08 కోట్ల వరకు లాభం పొందే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం పెట్టుబడి పెట్టడం వల్లే ఈ భారీ తేడా వస్తుంది.

ఇక త్వరగా లక్ష్యాన్ని చేరుకోవాలనుకునేవారికి కూడా SIP ఒక మార్గం. నెలకు రూ.11,000 చొప్పున పెట్టుబడి పెడుతూ 20 సంవత్సరాలు కొనసాగిస్తే మొత్తం పెట్టుబడి రూ.26.40 లక్షలు అవుతుంది. ఇదే 12 శాతం అంచనా రాబడితో చూస్తే, కాలం ముగిసే సమయానికి సుమారు రూ.1.01 కోట్ల నిధి పొందే అవకాశం ఉంది. అంటే దాదాపు రూ.74 లక్షలకుపైగా సంపాదన కేవలం కంపౌండింగ్ ద్వారానే వస్తుంది. అయితే SIPలో రాబడులు మార్కెట్‌కు అనుసంధానంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. కాబట్టి దీర్ఘకాల దృష్టితో, క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం అత్యంత కీలకం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఫండ్ ఎంపిక, ఓపిక, క్రమశిక్షణ ఉంటే చిన్న నెలవారీ పెట్టుబడితోనే పెద్ద ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చని వారు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us