AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేడి నీళ్లు తాగితే బాడీలో ఏం జరుగుతుంది..? ఈ నిజాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీళ్లు తాగడం ఆరోగ్యానికి అమృతం లాంటిదని మనం వింటూ ఉంటాం.. కానీ అదే అమృతం ఈ మండే ఎండల్లో మీకు విషంలా మారవచ్చని తెలుసా? బరువు తగ్గడానికో లేక బాడీని డీటాక్స్ చేయడానికో మీరు పాటిస్తున్న ఈ అలవాటు, వేసవిలో మీ జీర్ణ వ్యవస్థను చిన్నాభిన్నం చేయవచ్చు. ఆయుర్వేదం ప్రకారం అది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.

Krishna S
|

Updated on: Feb 25, 2026 | 5:52 PM

Share
ఉషపాన్ అంటే ఏంటి? బ్రహ్మ ముహూర్త సమయంలో గోరువెచ్చని నీరు తాగడాన్ని ఆయుర్వేదంలో ఉషపాన్ అంటారు. ఇది శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి, జీర్ణ అగ్నిని సక్రియం చేస్తుంది. అయితే, ఇది అందరికీ, అన్ని కాలాల్లోనూ వర్తించదు.

1 / 5
వేసవిలో వేడినీళ్లు ఎందుకు ప్రమాదం?: వేసవి కాలంలో ప్రకృతి సిద్ధంగానే వాతావరణంలో పిత్తం పెరుగుతుంది. ఈ సమయంలో మళ్లీ వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలో వేడి మరింత పెరిగి పలు సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. శరీరంలో పిత్తం పెరగడం వల్ల తీవ్రమైన అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.

2 / 5
అధిక వేడి వల్ల నోటిలో పుండ్లు రావడం, చిగుళ్ల సమస్యలు రావచ్చు. అవసరానికి మించి వేడినీళ్లు తాగడం వల్ల నోరు, ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఇప్పటికే అల్సర్లు లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్నవారికి, వేడినీళ్లు అన్నవాహిక కడుపు లైనింగ్‌ను దెబ్బతీస్తాయి.

అధిక వేడి వల్ల నోటిలో పుండ్లు రావడం, చిగుళ్ల సమస్యలు రావచ్చు. అవసరానికి మించి వేడినీళ్లు తాగడం వల్ల నోరు, ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇప్పటికే అల్సర్లు లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్నవారికి, వేడినీళ్లు అన్నవాహిక కడుపు లైనింగ్‌ను దెబ్బతీస్తాయి.

3 / 5
ఎవరు జాగ్రత్తగా ఉండాలి?: ముఖ్యంగా పైత్య స్వభావంఉన్నవారు వేసవిలో వేడినీళ్లకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ తాగాలని అనిపిస్తే, ప్రతిరోజూ కాకుండా రోజు విడిచి రోజు, అది కూడా కేవలం గోరువెచ్చగా ఉన్న నీటిని మాత్రమే తీసుకోవాలి.

4 / 5
ప్రతి మనిషి శరీర స్వభావం వేరు. ఒకరికి ప్రయోజనం చేకూర్చిన పద్ధతి మరొకరికి ఇబ్బంది కలిగించవచ్చు. అందుకే సోషల్ మీడియా ట్రెండ్స్‌ను గుడ్డిగా అనుసరించకుండా, మీ శరీర తత్వాన్ని బట్టి, అవసరమైతే ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

5 / 5
Follow Us