రంగారెడ్డి జిల్లా నోముల గ్రామంలో మంగళవారం ఘోరం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న వివాదం కారణంగా మదరమోని బాబూరావు తన భార్య అమృతపై గొడ్డలితో దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.