AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లండన్ ఫ్యాషన్ వీక్‌లో కృతి సనన్ సెన్సేషన్.. బర్బెర్రీ ‘గోయింగ్-అవుట్ కోట్’ లో గ్లోబల్ గ్లామర్!

లండన్ ఫ్యాషన్ వీక్ 2026 వేదికపై భారతీయ గ్లామర్ తళుక్కున మెరిసింది. అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బర్బెర్రీ షోలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన అద్భుతమైన లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టైలిష్ లుక్స్, పర్ఫెక్ట్‌ హెయిర్ స్టైల్స్‌తో ఆకట్టుకుంది.

లండన్ ఫ్యాషన్ వీక్‌లో కృతి సనన్ సెన్సేషన్.. బర్బెర్రీ ‘గోయింగ్-అవుట్ కోట్’ లో గ్లోబల్ గ్లామర్!
Kriti Sanon At London
Nikhil
|

Updated on: Feb 25, 2026 | 9:22 PM

Share

బర్బెర్రీ సంస్థ ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా పరిచయం చేసిన ‘గోయింగ్-అవుట్ కోట్’ కు ఆమె బెస్ట్ అంబాసిడర్‌గా నిలిచింది. లండన్ వీధుల్లో ఈ సుందరి చేసిన ఫ్యాషన్ విన్యాసాల గురించి తెలుసుకుందాం. ఆమె అడుగుపెడితే గ్లోబల్ ఫ్యాషన్ వేదికలు సైతం పులకించిపోతాయి. తన పొడవైన శరీర సౌష్టవంతో ఏ దుస్తులు ధరించినా అందులో ఒక రాయల్ లుక్ తీసుకురావడం ఆమె ప్రత్యేకత. తాజాగా లండన్ ఫ్యాషన్ వీక్ వేదికగా జరిగిన బర్బెర్రీ ఫాల్/వింటర్ 2026-27 షోలో ఆమె హాజరైన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. హాలీవుడ్ దిగ్గజాల మధ్య ఫ్రంట్ రోలో కూర్చుని, తనదైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌తో భారతీయ తారల సత్తా చాటిన ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. కృతి సనన్.

ఈ సీజన్ కొత్త ట్రెండ్..

బ్రిటిష్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ బర్బెర్రీ ఈ ఏడాది రన్‌వేపై తన మోస్ట్ అవేటెడ్ ‘గోయింగ్-అవుట్ కోట్’ను విడుదల చేసింది. లండన్ నగర రాత్రి జీవితాన్ని, అక్కడి చల్లని గాలులను ప్రతిబింబించేలా ఈ కోట్ ను డిజైన్ చేశారు. ఇది కేవలం ఒక జాకెట్ మాత్రమే కాదు, సాధారణ సాయంత్రాన్ని సైతం స్టార్-స్టడెడ్ అప్పీల్ తో మార్చేసే ఒక స్టేట్‌మెంట్ పీస్. వింటేజ్ బ్రిటిష్ స్టైల్ కు ఆధునిక హంగులను జోడించి దీనిని తీర్చిదిద్దారు.

కృతి సనన్ ఈ వేడుక కోసం రిచ్ చాక్లెట్ బ్రౌన్ రంగులో ఉన్న ట్రెంచ్-ఇన్‌స్పైర్డ్ ఫర్ కోట్ ఎంచుకుంది. షార్ప్ లాపెల్స్, ప్యాడెడ్ షోల్డర్స్ మరియు నడుము దగ్గర బెల్ట్ ఉన్న ఈ కోట్ లో ఆమె ఎంతో స్టైలిష్ గా కనిపించింది. ఈ బ్రౌన్ కలర్ అవుట్‌ఫిట్ కు టీల్ కలర్ సిల్క్ స్కార్ఫ్‌ను జోడించి, ఒక కలర్ పాప్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి తోడు మోకాలి వరకు ఉన్న లెదర్ బూట్స్, బర్బెర్రీ టాప్-హ్యాండిల్ బ్యాగ్ ఆమె లుక్ ను మరింత ఎలివేట్ చేశాయి. ఈ షోలో కృతి కేవలం ఒక అతిథిగా మాత్రమే కాదు, ఫ్యాషన్ ఐకాన్ గా గుర్తింపు పొందింది. కేట్ మాస్, సిమోన్ యాష్లే, ల్యూక్ థాంప్సన్ వంటి అంతర్జాతీయ స్టార్లతో కలిసి ఆమె ఫ్రంట్ రోలో కూర్చోవడం విశేషం. స్లీక్ హెయిర్, స్మోకీ ఐ మేకప్ తో ఆమె గ్లోబల్ వేదికలపై భారతీయ స్టార్ల ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్పింది.

కృతీ సనన్ సంప్రదాయ మరియు ఆధునిక శైలులను కలపడంలో ఎప్పుడూ ముందుంటుంది. గతంలో బనారసీ కో-ఆర్డ్ సెట్ తో ఆకట్టుకున్న ఆమె, ఇప్పుడు లండన్ వేదికపై వెస్ట్రన్ గ్లామర్ తో మెరిసింది. బర్బెర్రీ క్రియేటివ్ డైరెక్టర్ డేనియల్ లీ విజన్ కు కృతి లుక్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచింది.

Follow Us