Budget 2022: ఈ బడ్జెట్‌లో నిరుద్యోగుల కలలు ఫలించనున్నాయా.. నిర్మలమ్మ తీపి కబురు చెబుతారా?

Economy Budget 2022: కేంద్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 8.72 లక్షల పోస్టులను రిక్రూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. అలాగే ఆరోగ్యం, ఆతిథ్య రంగాలకు ఎలాంటి 'బూస్టర్ డోస్' ఇవ్వనున్నారు.

Budget 2022: ఈ బడ్జెట్‌లో నిరుద్యోగుల కలలు ఫలించనున్నాయా..  నిర్మలమ్మ తీపి కబురు చెబుతారా?
Budget 2022
Venkata Chari

|

Jan 30, 2022 | 10:40 AM

Budget Expectations 2022: 26 ఏళ్ల శ్యామ్ ఒక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కానీ, 2020లో కరోనా(Coronavirus) మొదటి వేవ్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. దీని తరువాత మరో ఉద్యోగం సంపాదించాడు. కానీ, అతను తన మునుపటి జీతం కంటే తక్కువకే పని చేయాల్సి వచ్చింది. అయితే, రెండవ వేవ్‌తో ఈ ఉద్యోగం కూడా పోయింది. ప్రస్తుతం శ్యామ్ దాదాపు ఏడాది కాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Niramala Sitaraman) ఫిబ్రవరి 1న కరోనా కాలంలో రెండవ బడ్జెట్‌(Budget 2022)ను సమర్పించనున్నారు. బడ్జెట్‌కు సంబంధించి శ్యామ్‌ లాంటి ఎంతోమంది నిరుద్యోగులు వేల ఆశలు పెట్టుకున్నారు. అలాగే ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న అన్ని ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని వారు కోరుకుంటున్నారు. అంతే కాకుండా ప్రైవేట్ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం మరింత వేగంగా ప్రయత్నించాలి.

8.72 లక్షల ఖాళీలు.. కరోనా కారణంగా అనేక విభాగాల నియామకాలు పట్టాలు తప్పాయి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మార్చి 1, 2020 నాటికి దాదాపు 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ 29 జులై 2021న రాజ్యసభలో తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో, ఉపాధి కల్పించడానికి వీలైనంత త్వరగా ఈ పోస్టులను నియమించాల్సి ఉంటుంది.

రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో వేగం.. ఈ ఖాళీలను పూర్తి చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రెండేళ్లకుపైగా పట్టవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఈప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటేనే అన్ని ఖాళీలు వేగంగా పూర్తవతాయి.

ఇన్‌ఫ్రా, హెల్త్, హాస్పిటాలిటీ రంగాలకు బూస్టర్ ప్యాకేజీ.. లాక్‌డౌన్‌తోపాటు కొన్ని ఆంక్షల కారణంగా ఇన్‌ఫ్రా, హెల్త్, హాస్పిటాలిటీతో సహా అనేక రంగాలు చాలా నష్టపోయాయి. ఇది కాకుండా, కరోనా ఆరోగ్య సంరక్షణ రంగంలోని లోపాలను కూడా బహిర్గతం చేసింది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో అనేక రంగాలపై దృష్టి సారించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వవచ్చు. దీంతో రానున్న కాలంలో ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

కరోనా కారణంగా, అసంఘటిత రంగంలోని హాకర్లు, వీధి వ్యాపారులు నిరుద్యోగం కారణంగా ఎక్కువగా దెబ్బతిన్నారు. వీరికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. కరోనా కాలంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మిగిలిపోయిందని ఆర్థిక నిపుణుడు డాక్టర్ కన్హయ్య అహుజా పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో మార్కెట్‌లోని మూలధన ప్రవాహాన్ని పెంచే అవకాశం ఉంది. దీంతో ప్రైవేటు రంగంలో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

ప్రజలు ఉపాధి కోసం MSMEపై దృష్టి.. ప్రభుత్వం MSME (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు)కి కూడా ఉపశమన ప్యాకేజీని ఇవ్వవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. యువత వలసలను అరికట్టి చిన్న పట్టణాలకు ఉపాధిని తీసుకురాగల రంగం ఇదే కావడంతో, ప్రభుత్వ దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనుంది. అందువల్ల, మరింత ఎక్కువ మంది యువతను ఉపాధి పొందేలా చేయడానికి, ప్రభుత్వం MSMEలపై దృష్టి పెట్టవచ్చు.

Also Read: Budget 2022: స్టాక్ మార్కెట్ ఆదాయాలపై LTCG, STTలను తగ్గించనున్నారా.. ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్ రానుందా?

Budget 2022: ఆర్థిక మంత్రి వైపే మహిళల చూపులు.. బడ్జెట్ 2022లో ఎలాంటి వరాలు ఇవ్వనున్నారంటే?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu