AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay-Rashmika: కాబోయే కోడలికి అత్తగారి నుంచి అందమైన గిఫ్ట్‌.. రష్మికకు విజయ్ తల్లి ఏమిచ్చిందో తెలుసా?

రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ వేదికగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇరు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంగీత్ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే.. విజయ్ తల్లి రష్మికకు ఒక అద్భుతమైన కానుకను ఇచ్చింది.

Vijay-Rashmika: కాబోయే కోడలికి అత్తగారి నుంచి అందమైన గిఫ్ట్‌.. రష్మికకు విజయ్ తల్లి ఏమిచ్చిందో తెలుసా?
Virosh Wedding
Basha Shek
|

Updated on: Feb 25, 2026 | 7:18 PM

Share

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్‌ క్రష్‌, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ‘విరోష్‌ వెడ్డింగ్’ అంటూ తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట శుక్రవారం (ఫిబ్రవరి 26)న పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే వధూవరులతో పాటు, ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఉదయ్ పూర్ కు చేరుకున్నారు. తెలుగు, కొడవ ఇలా రెండు సంప్రాదాయ పద్ధతుల్లో రష్మిక, విజయ్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 24) సంగీత్‌ వేడుక ఘనంగా జరిగింది. ఇప్పుడు ఈ వేడుకలకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. సంగీత్ వేడుకలో విజయ్ తల్లి మాధవి దేవరకొండ కుటుంబ సంప్రదాయం ప్రకారం రష్మికకు వారసత్వ పు గాజులను కానుకగా ఇచ్చారట. తద్వారా తమ ఫ్యామిలీ లోకి కోడలిగా రష్మికను ప్రేమగా ఆహ్వానించారట. ఈ క్రమంలో సంగీత వేడుక నుండి లీక్ అయిన ఒక ఫుటేజ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విరోష్ వెడ్డింగ్ లో భాగంగా బుధవారం హల్దీ వేడుక జరిగింది. మరోవైపు ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం సెలబ్రిటీలు ఒక్కొక్కరగా ఉదయ్ పూర్ చేరుకుంటున్నారు. డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్, హీరోయిన్లు ఇషా రెబ్బా, ఆషికా రంగనాథ్, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ తదితరులు ఇప్పటికే ఉదయపూర్‌లో దిగినట్టు తెలుస్తోంది. వీరితో పాటు కోకిలాబెన్ అంబానీ, ముఖేష్ అంబానీ, నీతా, ఆకాష్, శ్లోకా అంబానీలతో సహా అంబానీ కుటుబం కూడా విరోష్ వెడ్డింగ్ కు హాజరుకానున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

అట్టహాసంగా హల్దీ వేడుకలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us