AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే ఖరీదైన బియ్యం.. వీటిని కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా?

బియ్యం సాధారణంగా ఎక్కడైనా రూ.100 లేదా రూ. 150 ఉంటుంది. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే బియ్యం మాత్రం వందలు కాదు వేలల్లో ఉంది. సామాన్యులు వీటిని కొనలేరు, తినలేరు రేట్ అంత ఎక్కువ మరి ఎందుకు ఈ బియ్యం ఇంత ప్రత్యేకమైనవో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

ప్రపంచంలోనే ఖరీదైన బియ్యం.. వీటిని కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా?
Costly Rice
Prasanna Yadla
|

Updated on: Feb 25, 2026 | 7:15 PM

Share

మనం బియ్యం లేనిదే ఉండలేము ఎందుకంటే ఇది కూడా మన లైఫ్ లో ఒక భాగమైపోయింది. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం శక్తితో ఉండగలుగుతున్నాం అంటే అందుకు కారణం రైస్. ఇక పొలాల్లోకి వెళ్లే వాళ్లు అయితే ఇదే టిఫిన్ కింద తినేస్తారు. మరి ఇలా ఉపయోగపడుతున్న వాటిని డబ్బులు పెట్టి మరి మనం కొనుక్కుని తింటున్నాము. ఇవి తక్కువకి దొరుకుతున్నాయి కాబట్టి వీటి విలువ తెలీడం లేదు. కానీ, కొన్ని దేశాల్లో అయితే కొందామన్నా కూడా వందలు కాదు వేలల్లో పలుకుతున్నాయి. అవును మీరు విన్నది నిజమే.. మరి, ఇది ఎక్కడో తెలుసుకుందాం..

మనం దేశంలో ఉన్న ప్రజలు బియ్యాన్ని మూడు పూటలా తింటారు. కొందరు ఈ బియ్యాన్ని రూ. 60 నుంచి రూ. 100 వరకు పెట్టి కొనుక్కుని తింటారు. మరి ఇదే బియ్యం వేలు పలికితే వాటిని కొనగలరా? కొని తినగలరా? మన దగ్గర బాస్మతి బియ్యం మాత్రమే ఎక్కువ రేట్ ఉంటుంది ఎందుకంటే ఇది బిర్యానీ రైస్ కాబట్టి వాటిని రిస్క్ చేసి పండిస్తారు రైతులకు గిట్టుబాటు ధర ఉండాలి కాబట్టి కిలో నాలుగు వందల నుంచి ఐదు వందలు రూపాయలు ఉంటుంది.

జపాన్‌ లో కొత్త రకం బియ్యం వరల్డ్ వైడ్ గా ఫుడ్ లవర్స్ ను షాక్ కి గురిచేస్తోంది. కిన్‌ మెమాయ్ ప్రీమియం అని పిలవబడే ఈ బియ్యం కేజీ రూ.12,000 రూ.15,000 వరకు ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం..వీటిని చాలా తక్కువ పండిస్తారు. ఏడాదిలో వెయ్యి బాక్సులకు మించి ప్యాక్ చెయ్యరు. జపాన్ ప్రజలు ఈ బియ్యాన్ని పండుగల సమయంలో మాత్రమే కొంటుంటారు. ఇంకొందరు వీటిని గిఫ్ట్ గా ఇస్తారు. వీటికి ఇంత డబ్బులు పెట్టే బదులు మన దగ్గర అయితే ఒక స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుందని నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us