AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton: ముదురు మటన్‌ మెత్తగా, త్వరగా ఉడకాలంటే ఇలా చేయండి.. అబ్బబ్బ.. ఇక ముక్క కూడా మిగలదు..

మటన్ (మేక లేదా పొట్టేలు మాంసం) అనగానే చాలు.. నాన్ వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి తింటారు.. మటన్‌లోని ప్రతి భాగం స్పెషలే.. మటన్ లివర్, తిల్లి, కాళ్లు, తలకాయ.. ఇలా అన్నింటిని ఇష్టంగా వండుకుని తింటారు.. అయితే.. మటన్ ను కూరగా.. ఫ్రైగా.. ఇంకా ఎన్నో వేరైటీలతో వండుకుని తింటారు..

Mutton: ముదురు మటన్‌ మెత్తగా, త్వరగా ఉడకాలంటే ఇలా చేయండి.. అబ్బబ్బ.. ఇక ముక్క కూడా మిగలదు..
Mutton Curry
Shaik Madar Saheb
|

Updated on: Feb 25, 2026 | 6:45 PM

Share

మటన్ (మేక లేదా పొట్టేలు మాంసం) అనగానే చాలు.. నాన్ వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి తింటారు.. మటన్‌లోని ప్రతి భాగం స్పెషలే.. మటన్ లివర్, తిల్లి, కాళ్లు, తలకాయ.. ఇలా అన్నింటిని ఇష్టంగా వండుకుని తింటారు.. అయితే.. మటన్ ను కూరగా.. ఫ్రైగా.. ఇంకా ఎన్నో వేరైటీలతో వండుకుని తింటారు.. మటన్ (మేక మాంసం) అధిక-ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ B12 లతో కూడిన పోషకమైనది.. ఇది కండరాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తికి.. రక్త ఉత్పత్తికి సహాయపడుతుంది. అయితే.. మటన్ వంటకాలు చాలా స్పెషల్.. కొన్ని సందర్భాల్లో ముదురు మటన్ తొందరగా.. సరిగా ఉడకదు.. దీని కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్ని గంటలపాటు వండాల్సి వస్తుంది.. ఈ విషయంలో చాలా మంది అసంతృప్తికి లోనవుతారు. అయితే.. కొన్ని టిప్స్ ద్వారా మటన్ ను ఈజీగా ఉడికించవచ్చు.. ఈ విధానం మటన్ కర్రీని తక్కువ సమయంలో సిద్ధం చేయడంతోపాటు.. మంచి రుచికరంగా మార్చుకోవచ్చు..

ముదురు మటన్ తొందరగా ఉడకాలంటే ఇలా చేయండి..

ముదురు మటన్ (Tough Mutton) త్వరగా, మెత్తగా ఉడకాలంటే వండటానికి ముందు కొన్ని టిప్స్ పాటించాలి. కనీసం గంట ముందు మటన్ ను పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం లేదా పచ్చి బొప్పాయి పేస్ట్‌తో మ్యారినేట్ చేయడం మంచిదని పేర్కొంటున్నారు ఆహార నిపుణులు.. ఆ తర్వాత.. ప్రెజర్ కుక్కర్‌లో 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించడం లేదా కర్రీని వండుకోవడం ద్వారా మటన్ కర్రీ తొందరగా అవుతుంది. ఇలాంటి టిప్స్ పాటించడం ద్వారా.. మటన్ త్వరగా ఉడుకుతుందని పేర్కొంటున్నారు.

మటన్ కర్రీ తయారీకి ముందుగా కావలసిన పదార్థాలను సిద్ధం చేసుకోండి..

మటన్‌ను శుభ్రంగా కడిగి, పీసులుగా కట్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ కోసం అల్లం, వెల్లుల్లిపాయ, రెండు టమాటాలు, రెండు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అదనంగా, ఒక స్పూను గసగసాలు, నాలుగు యాలక్కాయలు, నాలుగు లవంగాలు, నాలుగు మిరియాలు, రెండు యాలక్కాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక స్పూను ధనియాలు కలిపి మెత్తటి పేస్ట్‌గా చేసుకోవాలి.

మటన్ కర్రీని ఇలా వండుకోండి..

వంట ప్రారంభించడానికి, ఒక కళాయి లేదా కుక్కర్ లో తగినంత నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారి, టమాటాలు మగ్గిన తర్వాత, శుభ్రం చేసుకున్న మటన్‌ను అందులో వేయాలి. మటన్‌ను వేసిన వెంటనే బాగా కలిపి, కొన్ని నిమిషాలు అలానే వదిలేయాలి. మటన్ నుండి నీరు బయటకు వస్తుంది.. ఇది మటన్ త్వరగా ఉడకడానికి సహాయపడుతుంది. మూతపెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత, మటన్ నుండి వచ్చిన నీరు కొద్దిగా తగ్గుతుంది.

ఈ దశలో, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్‌ను వేయాలి.. కలిపిన తర్వాత ఉప్పు, పసుపు, కారం మటన్‌లో వేయాలి. మసాలా, కారం ముక్కలకు బాగా పట్టేలా కలిపి, మూతపెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోయాలి.. కుక్కర్ అయితే.. ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అయితే.. సిమ్ లో ఉడికించడం వల్ల మటన్ త్వరగా మెత్తగా, రుచికరంగా తయారవుతుంది. ఆ తర్వాత గరం మసాలా.. కొత్తిమీర వేసి.. కలుపుకోవాలి.. ఆ తర్వాత వేడి వేడి సూపర్ మటన్ కర్రీని సర్వ్ చేసుకోవచ్చు.. ఇంకెందుకు ఆలస్యం.. ఈ మటన్ కర్రీని ఇంట్లో ప్రయత్నించి, దాని రుచిని ఆస్వాదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us