Budget 2022: స్టాక్ మార్కెట్ ఆదాయాలపై LTCG, STTలను తగ్గించనున్నారా.. ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్ రానుందా?

హైదరాబాద్‌కు చెందిన రాము అనే వ్యక్తి స్టాక్ మార్కెట్ ద్వారా ఏడాదిలో రూ.4 లక్షలు సంపాదించగా, అతడి ఖాతాలో మాత్రం రూ.3.60 లక్షలే ఉన్నాయి. వాస్తవానికి, ఈ ఆదాయాలపై..

Budget 2022: స్టాక్ మార్కెట్ ఆదాయాలపై LTCG, STTలను తగ్గించనున్నారా.. ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్ రానుందా?
Budget 2022
Follow us
Venkata Chari

|

Updated on: Jan 29, 2022 | 9:57 AM

Economy Budget 2022: హైదరాబాద్‌కు చెందిన రాము అనే వ్యక్తి స్టాక్ మార్కెట్(Stock Market) ద్వారా ఏడాదిలో రూ.4 లక్షలు సంపాదించగా, అతడి ఖాతాలో మాత్రం రూ.3.60 లక్షలే ఉన్నాయి. వాస్తవానికి, ఈ ఆదాయాలపై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ అంటే STT, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అంటే LTCG చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు మొత్తం ఆదాయంపై ఆదాయపు పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంటే, మొత్తం మూడు టాక్స్‌లు చెల్లించాలన్నమాట. మార్కెట్‌లో డబ్బు పెట్టిన లక్షల మంది పెట్టుబడిదారులు(Investors) ఫిబ్రవరి 1న సమర్పించే బడ్జెట్(Budget 2022) నుంచి రెండు భారీ అంచనాలను ఉంచుతున్నారు. మొదటిది – STTని రద్దు చేయడం, రెండవది – LTCGని తగ్గించాలని కోరుకుంటున్నారు.

ఎల్‌టీసీజీ స్థానంలో ఎస్‌టీటీ: 2004లో ఎల్‌టీసీజీ స్థానంలో ఎస్‌టీటీ వచ్చింది. అయితే రెండు పన్నులు వసూలు. చేస్తున్నారు. వాస్తవానికి 2004లో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఎల్‌టీసీజీ స్థానంలో ఎస్‌‌టీటీని తీసుకొచ్చారు. అయితే ఎల్‌టీసీజీని తొలగించలేదు. దీంతో ప్రస్తుతం పెట్టుబడిదారుడు సంపాదనపై రెండు పన్నులు చెల్లించాల్సి వస్తుంది. దీని తర్వాత మిగిలిన మొత్తం ఆదాయంపై కూడా ఆదాయపు పన్ను విధించనున్నారు. కాబట్టి STTని రద్దు చేయాలి లేదా LTCG పన్ను తగ్గించాలి. దీనితో పాటు ఆర్థిక సంస్కరణలను కొనసాగించాలనే డిమాండ్ కూడా ఉంది. ఇది వృద్ధిని కొనసాగించేలా చేస్తుంది.

మార్కెట్ నుంచి వచ్చే ఆదాయంపై పన్నులు… 4 లక్షలు ఆర్జించిన రాము షేర్‌లను విక్రయించే సమయంలో రూ.100 రూపాయల STT కట్టాల్సి వస్తుంది. రాము ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఓ వారానికి రూ. రూ. 4 లక్షల విలువైన ఈ షేర్లను విక్రయించాడు. దానిపై 10శాతం LTCG పన్ను విధించారు. అంటే దాదాపు రూ. 40 వేల రూపాయలు కట్టాల్సి వచ్చింది.

ఇది కాకుండా, రాము ఇతర వనరుల నుంచి రూ.3 లక్షలు సంపాదించాడు. ఈ విధంగా అతని మొత్తం ఆదాయం రూ. 3 లక్షలు + రూ.4 లక్షలు = రూ. 7 లక్షల రూపాయలు అవుతుంది. ఇందులో ముందుగా రూ.40 వేలు తగ్గించారు. మిగిలి ఉన్న ఆదాయం రూ. 7 లక్షల- రూ. 40,000 = రూ.6.60 లక్షలు. అంటే రాము ఈ రూ. 6.60 లక్షలపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తుంది.

ప్రస్తుత బడ్జెట్, తదుపరి రోజుల్లో మార్కెట్ ఎలా ఉండనుందంటే.. 2010 నుంచి బడ్జెట్ సమయంలో మార్కెట్ 9 సార్లు పడిపోయింది. మార్కెట్ డేటా ప్రకారం 2010 నుంచి 12 సార్లు బడ్జెట్‌లో, ఒక నెల క్రితం మార్కెట్ కదలికలతో 9 సార్లు బలహీనపడింది. 3 సార్లు మార్కెట్‌లో బుల్లిష్ ట్రెండ్ ఉంది. చివరిసారిగా జనవరి 1 నుంచి 31, 2021 మధ్య సెన్సెక్స్ 47,868 నుంచి 46,286కి పడిపోయింది. అంటే 1,582 పాయింట్ల క్షీణత నమోదైంది.

సెన్సెక్స్ 2020లో ఒక నెలలోపు 1.28శాతం నష్టపోయింది. అదేవిధంగా 2020లో, బడ్జెట్‌కు ముందు ఒక నెలలో సెన్సెక్స్ 1.28శాతం నష్టపోయింది. 2019లో, జూన్ 5, జూలై 5 మధ్య 0.04శాతం క్షీణించింది. జూన్‌లో సార్వత్రిక ఎన్నికల కారణంగా మళ్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మార్కెట్ 2018లో 5.6శాతం, 2017లో 4శాతం పెరిగింది. సెన్సెక్స్ 2016లో 6శాతం పతనమైతే, 2015లో 1.15శాతం పడిపోయింది. 2014లో సగం శాతం నష్టపోయింది.

ఈ సంవత్సరం కూడా బడ్జెట్‌కు ముందు సానుకూల, ప్రతికూల అంశాలు.. ఈ సంవత్సరం బడ్జెట్‌కు ముందు కొన్ని సానుకూల, కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి. ప్రతికూల విషయం ఏమిటంటే, కరోనా మూడవ వేవ్ కారణంగా, కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. అమెరికా వడ్డీ రేట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం కూడా 6శాతం కంటే ఎక్కువగానే ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్ నుంచి నిరంతరం డబ్బును ఉపసంహరించుకుంటున్నారు.

సానుకూల అంశం ఏమిటంటే కార్పొరేట్ ఆదాయాలు మెరుగవుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా బడ్జెట్ ఆసక్తికరంగా ఉంటుందని , స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ ఎండీ, సునీల్ న్యాతి వెల్లడించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసారి కాస్త ఆసక్తికరంగా బడ్జెట్‌ ఉండొచ్చు. గత మూడేళ్ల ట్రెండ్స్ జనవరి 15 నుంచి మార్కెట్ క్షీణించడం ప్రారంభిస్తుందని తెలియజేస్తున్నాయి. ఈ రంగం పనితీరును పరిశీలిస్తే, బడ్జెట్‌లో ఐటీ, ఫార్మా రంగం ఎల్లప్పుడూ మంచి పనితీరును కనబరుస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్టీ షేర్లలో అస్థిరత నెలకొంది. ఉపాధిని సృష్టించడంపై దృష్టి పెట్టవచ్చని, హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ఎండి, సీఈవో ధీరజ్ రెల్లీ ఈ బడ్జెట్ గత సంవత్సరం మాదిరిగానే కరోనా ప్రభావిత ఆర్థిక వ్యవస్థ సమయంలో వస్తోందని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్ ప్రాథమికంగా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ఉద్యోగాల కల్పనపై ఉంటుంది. అదే సమయంలో, ఇది డిమాండ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పెంచుతుంది. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపు విదేశీ పెట్టుబడిదారులకు, భారతీయ పెట్టుబడిదారులకు సరైన దిశానిర్దేశం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఈ స్టాక్‌లపై కన్నేయండి: ఇన్వెస్టర్లు టెలికాంలో వోడాఫోన్, ఎయిర్‌టెల్‌పై దృష్టి పెట్టవచ్చు. ICICI సెక్యూరిటీస్ టెలికాంలో వోడాఫోన్, ఎయిర్‌టెల్ ప్రధాన స్టాక్‌లు అని పేర్కొంది. ఆటోమొబైల్స్‌లో, టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రాలకు సానుకూలంగా ఉండవచ్చు. అలాగే మిండా కార్ప్ కూడా ఈ రంగంలో బాగుంది. హెల్త్‌కేర్‌లో, బ్రోకరేజ్ హౌస్ అపోలో హాస్పిటల్, నారాయణ హెల్త్‌కేర్ పాజిటివ్‌గా నివేదించింది. టెక్స్‌టైల్స్‌లో కేపీఆర్‌, గోకల్‌దాస్‌ ఎక్స్‌పోర్ట్‌లు మంచివి కాగా, రిటైల్‌లో ట్రెంట్‌, ట్రైడెంట్‌, వీమార్ట్‌లు ఉన్నాయి. అయితే బడ్జెట్‌లో వాటికి సంబంధించిన మంచి ప్రకటన వెలువడినప్పుడే ఇదంతా బాగుంటుందని తెలిపింది.

డబ్బును ఇన్వెస్ట్ చేసే వారు ఆటో రంగంపై కూడా దృష్టి సారించాలని , పెట్టుబడిదారులు ఆటో రంగంపై దృష్టి సారించాలని చాయిస్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ సుమిత్ బగాడియా తెలిపారు. ఇందులో, మీరు రెండు స్టాక్‌లపై పెట్టుబడులు పెట్టవచ్చని తెలిపారు. అశోక్ లేలాండ్, హీరో మోటోకార్ప్ మంచి స్టాక్స్ అని నిరూపించవచ్చు. దేవెన్ చోక్సీ, MD, KR చోక్సీ మాట్లాడుతూ వ్యవసాయంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, ఇది ఏడాది పొడవునా చర్చనీయాంశంగా మారింది. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చెల్లించేలా ప్రభుత్వం ఈ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేయవచ్చు. ఇన్‌ఫ్రా కోసం అక్టోబరు 2021లో గతి శక్తి యోజనను ప్రధానమంత్రి ప్రకటించారు. ఇందుకోసం రూ. 100 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై కూడా దృష్టి సారించనున్నారు.

Also Read: Budget 2022: ఆర్థిక మంత్రి వైపే మహిళల చూపులు.. బడ్జెట్ 2022లో ఎలాంటి వరాలు ఇవ్వనున్నారంటే?

Budget2022: ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేలా ఆరోగ్య బడ్జెట్ ఉండాలంటున్న నిపుణులు

ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..