కాన్పూర్‌లో కనిపించిన మరో వింత పక్షి.. తెల్ల రాబందు తర్వాత ఇప్పుడు ఇది.. అక్కడికే ఎందుకు వస్తున్నాయి..
ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ వాసులకు మరో అరుదైన పక్షి కనిపించింది. గత రెండు రోజుల క్రితం కాన్పూర్‌లో అరుదైన రాబందు కనిపించిన తర్వాత ఇప్పుడు అక్కడ తెల్ల గుడ్లగూబ కనిపించింది.

కాన్పూర్‌లో తెల్ల గుడ్లగూబ కనిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వింత జీవులతో వార్తల్లో నిలిచింది. ఒకరోజు క్రితం కాన్పూర్‌లో అరుదైన రాబందును చూసిన తర్వాత ఇప్పుడు అక్కడ తెల్ల గుడ్లగూబ కనిపించింది. సాధారణంగా ఇటువంటి గుడ్లగూబలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ అరుదైన గుడ్లగూబ గురించి తెలిసిన వెంటనే ప్రజలు దానిని చూసేందుకు అక్కడికక్కడే చేరుకున్నారు. కాన్పూర్‌లోని నవీన్ మార్కెట్‌లో ఈ గుడ్లగూబ కనిపించింది. గుడ్లగూబ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. దుకాణం కిటికీలో తెల్ల గుడ్లగూబ కూర్చుని ఉండడం చూసిన జనం.. ఆ మాట నగరమంతా వ్యాపించింది. అప్పుడు ఈ ప్రత్యేకమైన గుడ్లగూబను చూసేందుకు జనాలు అక్కడికి చేరుకున్నారు. దీంతో కొందరు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం అటవీ శాఖ బృందం గుడ్లగూబను పట్టుకుని తమ వెంట తీసుకెళ్లారు. గుడ్లగూబను రక్షిత పక్షిగా పరిగణిస్తారని అటవీ అధికారి లల్లూ సింగ్ చెప్పారు. ఇది ఎక్కడ నుండి వచ్చిందనేదాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు.
నవీన్ మార్కెట్‌లోని దుకాణదారుడు ఛోటూ మాట్లాడుతూ.. “మేము ఉదయం దుకాణాన్ని తెరిచినప్పుడు గుడ్లగూబ కిటికీ దగ్గర తెల్ల గుడ్లగూబ కనిపించింది. అది కిటికీ దగ్గర నిశ్శబ్దంగా కూర్చుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. అయితే మా షాపులో తెల్ల గుడ్లగూబ కూర్చున్నదని తెలియగానే చాలా మంది ఆ గుడ్లగూబను చూసేందుకు రావడం మొదలయ్యారని తెలిపారు. గత రెండు రోజులు వింత పక్షులతో తమ నగరం దేశ వ్యాప్తంగా చర్చలోకి వచ్చిందని అన్నారు.”
4 రోజుల క్రితం తెల్లటి హిమాలయ రాబందు లభ్యం కాగా..
రాములవారికి సాయం చేసేందుకు వానరాలు, పక్షులు.. ఒకటేమిటీ ఇలా చాలా జీవరాశులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కీలక దశకు చేరుకున్న సమయంలో.. తన ప్రభువు శ్రీరాములవారి వైభవాన్ని కళ్లారా చూసేందుకు క్యూ కడుతున్నాయా.. ? అన్నట్లుగా ఉంది. నిన్న హిమాలయన్ రాబందు ఒకటి కనిపించగా తాజాగా ఇవాళ మరో అరుదైన పక్షి కనిపించింది. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. పెద్ద పెద్ద రెక్కలు వేసుకొని ఓ అరుదైన పక్షి అక్కడ వాలడమే ఇందుకు కారణం.
అంతకుముందు 4 రోజుల క్రితం ఇక్కడి ఈద్గా సమీపంలో తెల్లటి హిమాలయ రాబందు కనిపించగా.. దానిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ రాబందు రెక్కలు దాదాపు ఆరు అడుగులు ఉన్నాయి. ఈ రాబందు వయస్సు వంద సంవత్సరాలకుపైగానే ఉంటుందని అంచనా. ఒక జత రాబందులు చాలా రోజులు ఇక్కడ విడిది చేశాయి.
హిమాలయన్ రాబందును గుర్తించిన కనిపించడంతో ఈద్గాలో నివసిస్తున్నఓ యువకుడు మరికొందరితో కలిసి పట్టుకున్నట్లు చెబుతున్నారు. తెల్ల రాబందును చూసేందుకు వందలాది మంది గుమిగూడారు. ఈ విషయంపై కల్నల్‌గంజ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాబందును పట్టుకున్నారు. దీంతో పోలీసులు రాబందును అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం