AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడి గంటలే టార్గెట్.. ఉదయం భక్తుల్లా నటిస్తూ.. రాత్రికి దొంగలుగా మారి.. చివరికి..

వారు రోజూ గుడికి వెళ్తారు.. భక్తితో అనుకుంటే పొరపాటే. మరి వారు ఎందుకు వెళ్తారో తెలుసా.. గుడి గంటలు కొట్టేయడానికి. అదేమిటి.. గుడి గంటలు దొంగతనం చేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా. రాగికి ఎక్కువ డిమాండ్ ఉందనే...

గుడి గంటలే టార్గెట్.. ఉదయం భక్తుల్లా నటిస్తూ.. రాత్రికి దొంగలుగా మారి.. చివరికి..
Temple Bells Theft
Ganesh Mudavath
|

Updated on: Jan 11, 2023 | 5:30 PM

Share

వారు రోజూ గుడికి వెళ్తారు.. భక్తితో అనుకుంటే పొరపాటే. మరి వారు ఎందుకు వెళ్తారో తెలుసా.. గుడి గంటలు కొట్టేయడానికి. అదేమిటి.. గుడి గంటలు దొంగతనం చేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా. రాగికి ఎక్కువ డిమాండ్ ఉందనే రీజన్ తో వారు ఈ చోరీని ఎంచుకున్నారు. ఉదయం గుడికి వెళ్లడం, భక్తుల్లా నటిస్తూ రెక్కీ నిర్వహించడం వారి హాబీ. రాత్రి ఎవరూ సమయంలో గుడికి వెళ్లి కొట్టేస్తుంటారు. వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. కర్నాటకలోని మైసూరు ప్రాంతానికి చెందిన అమ్జాద్ అహ్మద్, సమీవుల్లా, జుల్ఫికర్, హైదర్ లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు కొడగు, మైసూర్, హసన్ వంటి జిల్లాల్లో దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశారు. అయితే.. దొంగతనం చేయడంలోనూ టెక్నిక్ ఫాలో అయ్యారు. ఇళల్లో దొంగతనాలు చేయకుండా ఊరి బయట ఉన్న దేవాలయాలను టార్గెట్ చేసుకున్నారు. కారులో పగటి పూట వెళ్లి చూసి వచ్చేవారు. రాత్రి సమయంలో రాగి కట్లర్​ను ఉపయోగించి గుడి గంటలను దొంగిలించేవారు.

పాత రాగికి మంచి ధర ఉన్నందున వాటిని దొంగిలించి విక్రయించేవారు. ఈ క్రమంలో నాపోక్లు బేతు గ్రామంలోని శ్రీమక్కి శాస్తావు ఆలయంలోని 30 గంటలు సెప్టెంబరు 11న చోరీకి గురయ్యయి. హలిగట్టు భద్రకాళి ఆలయంలో 10 గంటలు చోరీకి గురయ్యాయి. ఉదయం గుడికి వెళ్లిన పూజారులు.. దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

తెల్లవారు జామున రెండు గంటల సమయంలో ఈ గంటలను దొంగిలించారని తెలుసుకుని అవాక్కయ్యారు. ఈ వరస దొంగతనాలకు సంబంధించిన కేసును దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుల నుంచి 100కు పైగా గుడి గంటలను, కారును స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..