Brihadeeswaralayam Temple: అలనాటి భారతీయ మేధస్సుకు చిహ్నం ఈ ఆలయం.. అనేక రహస్యాల నిలయం బృహదీశ్వరాలయం

యునెస్కో వారసత్వ సంపదల్లో ఒకటైన ఈ ఆలయంలోనే ఓ భారీ నంది విగ్రహం మనకు కనిపిస్తుంది. మన లేపాక్షి బసవన్న తర్వాత ఎత్తయిన నంది ఇదే! ఈ నంది ఎదురుగానే ప్రధాన ఆలయముంటుంది.

Brihadeeswaralayam Temple: అలనాటి భారతీయ మేధస్సుకు చిహ్నం ఈ ఆలయం.. అనేక రహస్యాల నిలయం బృహదీశ్వరాలయం
Brihadeeswaralayam Temple
Follow us

|

Updated on: Jan 11, 2023 | 9:04 AM

భారతీయ శిల్పకళా వైభవానికి రెండు వందల అడుగుల రుజువు ఇది. భారతీయ కళాజగతికి గొప్ప గోపురం ఇది! అంతుచిక్కని రహస్యాలను ఇమడ్చుకున్న అద్భుత ఆలయం ఇది! నింగిని ముద్దాడుతున్నట్టు కనిపిస్తున్న ఈ చారిత్రాత్మక ఆలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది.. దీన్ని బృహదీశ్వరాలయం అంటారు. గిరి శిఖరంలా ఎత్తైన ఈ కట్టడం కళలు ఆధ్యాత్మికతకే కాదు…వెయ్యేళ్ల కిందటి నిర్మాణ నైపుణ్యతకు, సాంస్కృతిక వైభవానికి అద్దం పడుతోంది.

వెయ్యేళ్లుగా అలాగే చెక్కు చెదరకుండా వుండటం అపూర్వం…పదో శతాబ్దంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజరాజ చోళుడు ఈ అద్భుత దేవాలయాన్ని నిర్మించాడు. ఇంత పెద్ద ఆలయ గోపురం ఎత్తు ఎంతో తెలుసా? 216 అడుగులు…ఇంత ఎత్తైన దేవాలయానికి ఎంత లోతు పునాది వుంటుందోనని ఆలోచిస్తున్నారా? అసలు ఈ గుడికి పునాదే లేదు…నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.

ఆలయ నిర్మాణంలో రాయి కానీ ఉక్కు కానీ ఎక్కడా వాడలేదంటే నమ్మాలి. 13 అంతస్తులకు గ్రానైట్‌ను మాత్రమే వినియోగించారు. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే లక్షా 30 వేల టన్నుల గ్రానైట్‌ను ఉపయోగించారు. ఇంకో విచిత్రమేమిటంటే చుట్టుపక్కల ఎక్కడా గ్రానైట్‌ నిక్షేపాలు లేవు.. మరి ఎక్కడ్నుంచి ఇంత పెద్ద మొత్తంలో గ్రానైట్‌ తెచ్చారన్నది కూడా మిస్టరీనే! దేవాలయంలోకి అడుగు పెట్టగానే పదమూడు అడుగుల ఎత్తున్న శివలింగం కనిపిస్తుంది. ఐదు పడగల నాగేంద్రుని నీడన శివలింగ రూపంలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. ఆలయంలో అడుగడుగున కనిపించే అద్భుతాల్లో ఇదొకటి.

ఇవి కూడా చదవండి

యునెస్కో వారసత్వ సంపదల్లో ఒకటైన ఈ ఆలయంలోనే ఓ భారీ నంది విగ్రహం మనకు కనిపిస్తుంది. మన లేపాక్షి బసవన్న తర్వాత ఎత్తయిన నంది ఇదే! ఈ నంది ఎదురుగానే ప్రధాన ఆలయముంటుంది. 20 టన్నుల బరువు, రెండు మీటర్ల ఎత్తు, ఆరు మీటర్ల పొడవున్న ఈ నంది విగ్రహం ఏకశిలతో నిర్మించారు. ఈ నంది మండపాన్ని చోళ రాజుల తర్వాత పరిపాలించిన నాయక రాజులు అందమైన నగిషీలతో చిత్రించి అద్భుత రీతిలో మలిచారు. ఆలయం పై భాగం మహాముఖ మండపాలతో నాలుగు అంతస్తులతో వుంటుంది. ఆలయ ప్రధాన ద్వారం గుడిలోకి వెళ్లే ద్వారాలపై అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి.

80 టన్నుల బరువున్న ఏకశిలా గోపురాన్ని అంతపైకి ఎలా తీసుకెళ్లారన్నది అంతు చిక్కని రహస్యమే! కొంతమందేమో ఆలయానికి మైళ్ల కొద్దీ దూరం వరకు ఓ ర్యాంప్‌ వేసి అందులోంచి ఏనుగుల సాయంతో గోపురాన్ని దొర్లించుకొచ్చారంటారు. మరికొందరేమో పైనున్న గోపురం ఏకశిల కాదంటారు. గోపురం నీడ నేల మీద పడదంటారు కానీ ఇది వాస్తవం కాదు. విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి మూడు ద్వారాలున్నాయి. మొదటి ద్వారం ప్రవేశ ద్వారం.. దీన్ని కేరళాంతకన్‌ అంటారు. రెండో ద్వారం రాజరాజన్‌ తిరువనల్‌..మూడో ద్వారం తిరువానుక్కన్‌ తిరువనల్‌..గర్భ గుడిలో చాలా పెద్ద లింగ పీఠమూ..దాని మీద అతి పెద్ద లింగమూ వున్నాయి. దేశంలో ఇదే అతి పెద్ద లింగము. గుడిలో ఆశ్చర్యపరిచే మరో అంశం ఉంది.. అది గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు. ఈ తోరణాల రంధ్రాలు ఆరు మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజులో వంపులతో ఉన్నాయి.

ఆలయ బయటి ద్వారాల పక్కన ఎత్తయిన ద్వారపాలకుల విగ్రహాలుంటాయి. గర్భాలయం గోడలో దక్షిణ దిక్కున కూర్చున్న శివుడు… పడమటి వైపున నటరాజు.. ఉత్తరాన దేవీ మూర్తులు వున్నారు. అంతే కాకుండా ప్రదక్షిణ మార్గం లోపలి గోడపై…కుడ్య స్తంభాలపై వర్ణ చిత్రాలు కనిపిస్తాయి. ఇందులో శివుడు త్రిపురాసురుడిని సంహరించిన గాథను చిత్రీకరించారు. నటరాజును పూజిస్తున్న రాజు… పక్షులు…అందమైన లతలు.. నాట్య భంగిమలతో వున్న నాట్యకత్తెలు… ఇలాంటి వర్ణచిత్రాలు ఆశ్చర్యపరిచే రీతిలో వున్నాయి. మహానందికి ఉత్తరాన నటరాజ విగ్రహం జీవకళ ఉట్టిపడుతూ వుంటుంది.. ప్రధానాలయం బృహదీశ్వరాలయానికి ఆగ్నేయంలో వినాయకుడి గుడి…వాయివ్యంలో సుబ్రహ్మణ్య స్వామి గుడి వున్నాయి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా వుంది. కుల మత వర్గ భేదం లేకుండా అందరూ ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ ఆలయంలో సొరంగ మార్గాలు కూడా ఉన్నాయట. కొన్ని సొరంగాల నుంచి వెళితే తంజావూరులోని ఇతర ఆలయాలకు చేరుకుంటామట! మరికొన్ని సొరంగ మార్గాలు మాత్రం మృత్యుముఖంలోకి తీసుకెళతాయట! ఇవి రాజరాజచోళుడు తగు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గాలు అని కొందరు అంటుంటారు.

మరో ఆసక్తికరమైన విషయానికి వద్దాం. 1938లో తొలిసారి ఇండియాలో వెయ్యి రూపాయల నోటు చెలామణిలోకి వచ్చింది. అప్పుడు బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ నోటు మీద బృహదీశ్వర ఆలయం బొమ్మనే ముద్రించింది. 1946లో ఆ నోటును రద్దు చేశారనుకోండి.. బృహదీశ్వర ఆలయం సహస్ర సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఓ ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది.. చోళుల తర్వాత తంజావూరు ప్రాభావన్ని కోల్పోయింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??