Lord Hanuman: పనిలో చిక్కులున్నా.. ఆర్ధిక ఇబ్బందులున్నా మంగళవారం హనుమంతుడికి ఈ నాలుగు పరిహారాలు చేసి చూడండి..

మీ జాతకంలో శని మహాదశ కొనసాగుతున్నా లేదా శని దోషం వల్ల జరుగుతున్న పనిలో ఆటంకాలు ఏర్పడుతున్నా మంగళవారం నాడు 108 తులసి ఆకులపై పసుపు చందనంతో రాముని నామాన్ని రాయండి.

Lord Hanuman: పనిలో చిక్కులున్నా.. ఆర్ధిక ఇబ్బందులున్నా మంగళవారం హనుమంతుడికి ఈ నాలుగు పరిహారాలు చేసి చూడండి..
Lord Hanuman
Follow us

|

Updated on: Apr 03, 2023 | 5:14 PM

జ్యోతిష్య శాస్త్రంలో, హిందూ సనాతన ధర్మంలో మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. మంగళవారం రోజున  కొన్ని  ప్రత్యేక చర్యలు తీసుకుంటే..  జీవితంలో కష్ట, నష్టాలు దూరమై సుఖ సంతోషాలు దక్కుతాయని విశ్వాసం. ఈ నేపథ్యంలో మంగళవారానికి రోజున హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవానికి చేయాల్సిన మూడు పనుల గురించి తెలుసుకుందాం.. ఆ చర్యలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

మంగళవారం చేయాల్సిని పరిహారాలు:

శని మహాదశ తొలిగిపోవడానికి: మీ జాతకంలో శని మహాదశ కొనసాగుతున్నా లేదా శని దోషం వల్ల జరుగుతున్న పనిలో ఆటంకాలు ఏర్పడుతున్నా మంగళవారం నాడు 108 తులసి ఆకులపై పసుపు చందనంతో రాముని నామాన్ని రాయండి. దీని తర్వాత ఆ ఆకులతో ఒక దండను తయారు చేసి హనుమంతుడికి అలంకరించండి. ఇలా చేయడం ద్వారా రాహువు, కుజుడు-శని గ్రహాలకు సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోతాయని.. ఆర్ధిక సంక్షోభం నివారించబడుతుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

కష్టాలనుంచి బయటపడడానికి: మీరు మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచి.. అభ్యంగ స్నానం చేసి.. ఆపై హనుమంతుని ఆలయానికి వెళ్లి పూల మాలలు, దీపాలు, లడ్డూలను సమర్పించండి. అనంతరం 108 సార్లు హనుమాన్ చాలీసా పఠించండి. మీ కష్టాలన్నీ తొలగిపోవాలని హనుమంతుడిని ప్రార్థించండి. ఈ పరిహారాన్ని ప్రతి మంగళవారం, శనివారం చేయడం ద్వారా.. జన్మ నక్షత్రానికి సంబంధించిన ఇబ్బందులు తొలగి శుభాలు కలుగుతాయి.

అకాల మరణ  భయం నుంచి : అకాల మరణం భయంతో ఇబ్బంది పడేవారు.. మంగళవారం ఉదయం హనుమంతుడి  ఆలయానికి వెళ్లి హనుమాన్ కు సింధూరం సమర్పించండి. దీనితో పాటు గులాబీ పూల దండను సమర్పించండి. దీనితో పాటు ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి.. సుందరకాండను పఠించండి. ఈ పరిహారాన్ని 11 మంగళవారాలు చేయడం ద్వారా.. అతని అన్ని కష్టాలు నివారించబడతాయి. అకాల మరణ ప్రమాదం కూడా దూరమవుతుంది.

ఆర్థిక సంక్షోభం తొలగిపోవడానికి: ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతుంటే..  ప్రతి మంగళవారం రోజున ఏ సమయంలోనైనా  చాలా కోతులు ఉన్న ప్రదేశానికి వెళ్లండి. అక్కడ కోతులకు అరటిపండ్లు, బెల్లం, శనగలు, శనగలు తినిపించండి. నిరుపేదలకు ఆహారం అందించండి.  ఈ చర్యలు మంగళవారం రోజున చేయడం ద్వారా.. అదృష్టం ప్రకాశిస్తుంది. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)