Marks on Tongue: నాలుకపై మచ్చలు ఉన్నవాళ్ళు ఏమన్నా జరుగుతుందా..? దీనిలో నిజమెంత..? తెలుసుకుందాం రండి..

నాలుకపై మచ్చలు ఉన్నవారి గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే.. మచ్చలు ఉన్నవారు కొన్ని నియమాలు పాటించాలి. వారికి తెలియదు కాబట్టి నియమాలను పాటించరు. వాళ్లు..

Marks on Tongue: నాలుకపై మచ్చలు ఉన్నవాళ్ళు ఏమన్నా జరుగుతుందా..? దీనిలో నిజమెంత..? తెలుసుకుందాం రండి..
Marks On Tongue
Follow us

|

Updated on: Jan 10, 2023 | 1:21 PM

మీరు వినే ఉంటారు ‘నాలుక మీద మచ్చలు ఉన్నవాళ్లు అన్న మాట జరుగుుతుంద’ని. అలాంటి మచ్చలు జన్మ రీత్యా చాలా అరుదుగా వస్తుంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే కోటిలో ఒక్కరికి రావడం కూడా అరుదే. ఇలా మచ్చలు వచ్చినవారు ఏదైనా పూర్వ జన్మ సుకృతం చేసుకుంటే తప్ప రావని కూడా అంటారు. లేదా పూర్వజన్మలో మహా పుణ్యాత్ములు అయిన వారికి తర్వాతి జన్మలో నాలుక మీద మచ్చలు వస్తాయని కొందరు అంటుంటారు. మరి నాలుకపై మచ్చలు ఉన్నవారి గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే.. మచ్చలు ఉన్నవారు కొన్ని నియమాలు పాటించాలి. వారికి తెలియదు కాబట్టి నియమాలను పాటించరు. వాళ్లు నియమాలను పాటిస్తూ సక్రమ మార్గంలో నడుచుకుంటే వారికి, వారి చుట్టూ ఉన్నవాళ్లకి కూడా ఎంతో మేలు చేరుగుతుంది.

వారు అన్నది ఏదో ఓ నాటికి తప్పకుండా జరుగుతుంది. అలాగే వారు మాట్లాడిన చెడు కూడా జరగకపోదు. వారు అన్న ప్రతీ మాట తప్పక జరిగి తీరుతుంది. అందువల్ల నాలుకపై మచ్చలు ఉన్నవారితో జాగ్రత్తగా ఉండడం లేదా వారి నోట్లో నోరు పెట్టకపోవడం మనకే చాలా మంచిది. ఎందుకంటే వాళ్లు తెలిసీ తెలియక ఏ మాట అనాలి ఏ మాట అనకూడదునే విచక్షణ లేకుండా అనేస్తుంటారు. సత్ప్రవర్తనతో ప్రవర్తించిన వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది.

ఇంకా నాలుకపై మచ్చలు ఉన్నవారు దుష్టులకు దూరంగా ఉండాలి. ఆలోచించి మంచి మాట్లాడితే మంచి అవుతుంది, విచక్షణారహితంగా చెడు మాట్లాడినా జరుగుతుంది. ఎందుకంటే వాళ్లకు తెలియకపోవచ్చు.. నాలుక మీద మచ్చలు ఉన్నాయి, ఇలా అనవచ్చా అనకూడదా అనే జ్ఞానం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..